గుంటూరు సామూహిక అత్యాచారం కేసులో పురోగతి..!

గుంటూరు సామూహిక అత్యాచారం కేసులో పురోగతి..!
సీతానగరం పుష్కర ఘాట్ల వద్ద నదీ తీరంలో యువతిపై సామూహిక అత్యాచారం ఘటన రాష్ట్రంలో కలకలం సృష్టించింది.

సీతానగరం పుష్కర ఘాట్ల వద్ద నదీ తీరంలో యువతిపై సామూహిక అత్యాచారం ఘటన రాష్ట్రంలో కలకలం సృష్టించింది. శనివారం రాత్రి కాబోయే భర్తతో కలిసి యువతి ప్రకాశం బ్యారేజీ సీతానగరం పుష్కరఘాట్‌ దగ్గర ఇసుక తిన్నెలపై సేద తీరేందుకు వెళ్లగా.. అప్పటికే అక్కడ మాటేసిన ఇద్దరు దుండగులు వీరి కదలికలు గమనిస్తూ వెనుకవైపు నుంచి ఒక్కసారిగా వచ్చి దాడి చేశారు. బ్లేడ్లు చూపుతూ చంపేస్తామని బెదిరించి యువకుడిని కట్టేసి.. యువతిపై అత్యాచారం చేశారు.

ఆ ప్రాంతం రోడ్డుకి దూరంగా ఉండటంతో బాధితులు కేకలు వేసినా ఎవరికీ వినిపించలేదు. అనంతరం యువ జంట వద్దనున్న సెల్‌ఫోన్లు, డబ్బు, చెవిదుద్దులు దోచుకొని, నాటు పడవపై నిందితులు పారిపోయారు. కొద్దిసేపటి తర్వాత అటుగా వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడు విషయం తెలుసుకుని తాడేపల్లి పోలీసులకు సమాచారని తెలిపారు. అక్కడి నుంచి బాధితురాలిని ఆస్పత్రికి తరలించామన్నారు.

ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. నిందితుల కోసం కృష్ణా, గుంటూరు జిల్లాల పోలీసులు జల్లెడపడుతున్నారు. ప్రకాశం బ్యారేజీ దిగువభాగాన మహానాడు సమీపంలోని రైల్వే వంతెన కింద నిందితులు యువతిపై అత్యాచారానికి పాల్పడి.. నాటుపడవపై విజయవాడవైపు వెళ్లినట్లు బాధితులు తెలిపారు. అప్పటికే చీకటి పడిపోవడంతో నిందితులను గుర్తించడం వారికి కష్టమైందని పోలీసులతో చెప్పారు. మొత్తం ఆరు టీమ్‌లు రంగంలోకి దిగి నిందితుల కోసం దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story