Psycho Attack: సైకోల వీరంగం.. మూగజీవాలపై కత్తిపోట్లు

గోనెగండ్లలో సైకోలు వీరంగం సృష్టించారు. రాత్రి సమయంలో గుర్తు తీయలేని వ్యక్తులు మూగజీవాలపై ఆవులు, ఎద్దులు, ఎంపగొడ్లుపై కత్తులతో తీవ్రంగా పొడిచి వెళ్లారు. కత్తిపొట్లకు తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో పెద్ద ఎత్తున మూగజీవాలు అర్తనాదాలు పెట్టాయి. గమనించిన పశువుల యజమానులు, రైతులు గోనెగండ్ల పశువైద్యశాలలో చికిత్సకై తరలించారు. మొత్తం10 పశువులపై దాడి చేయడంతో రైతులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మూగజీవాలపై ఇంత పాశవికంగా దాడి చేయడం అమానుషమని పశువుల యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము వీటిపైనే జీవనం సాగించే వాళ్లమని.. ఇలా చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అయితే, ఇది గ్రామానికి చెందిన వ్యక్తి చేసిన పనేనా.. లేక ఏదైనా కక్ష పెట్టుకుని ఇలా చేస్తున్నారా.? అనేది తెలియాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com