16 హత్యలు : సైకో కిల్లర్ అరెస్ట్!

ఏకంగా 16 మంది మహిళలను హత్య చేసిన సైకో కిల్లర్ రాములును హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పక్కా ప్లాన్ ప్రకారం.. పోలీసులు హంతకుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మీడియాకి వెల్లడించారు.
చిన్నప్పుడే పెళ్లి చేసుకున్న రాములు తన భార్యతో విడిపోవడంతో మానసికంగా దెబ్బ తిన్నాడు. దీనితో మహిళల పైన కక్ష పెంచుకున్నాడు. అప్పటి నుండి హత్యలకు పాల్పడుతున్నాడు. ముందుగా ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో అతనిపైన కేసు నమోదైంది. ఆ తర్వాత తూప్రాన్, సంగారెడ్డి, నరసాపూర్, బోయినపల్లిలో ఇద్దరిని, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కేసులు నమోదు అయ్యాయి.
అయితే 2011లో ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రి నుంచి పరారైన రాములు.. ఐదు దోపిడీలకు పాల్పడ్డాడు. 2013 లో అతనిని బోయినపల్లి పోలీసులు అరెస్ట్ చేయగా, 2018 లో జైలు నుండి విడుదలై మరో రెండు హత్యలకి పాల్పడ్డాడు. నిందితుడి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com