Pune : గూగుల్ ఆఫీసులో బాంబు.. హైదరాబాద్ లో నిందితుడు

Pune : గూగుల్ ఆఫీసులో బాంబు.. హైదరాబాద్ లో నిందితుడు
హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి మద్యం మత్తులో గూగుల్ ఆఫీసులో బాంబు ఉందని ఫోన్ చేశాడు

గూగుల్ ఆఫీస్ లో బాంబు ఉన్నట్లు ఫోన్ చేశాడు ఓ అగంతకుడు. అప్రమత్తమైన సిబ్బంది ఫేక్ కాల్ అని తేల్చారు. పూణే ముంధ్వా ప్రాంతంలోని ఓ బిల్డింగ్ 11వ అంతస్ధులో గూగుల్ కార్యాలయం ఉంది. ఆదివారం అర్థరాత్రి గూగుల్ ఆఫీస్ కు ఓ వ్యక్తి కాల్ చేశాడు. ఆఫీస్ లో బాంబు ఉన్నట్లు హెచ్చరించాడు. భయానికి గురైన ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. బాంబ్ డిటెక్షన్, డాగ్ స్వ్కాడ్ ఆఫీస్ లో తనిఖీలు చేసారు. చివరికి అదిఫేక్ కాల్ అని పోలీసులు నిర్థారించారు.


హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి ఫేక్ కాల్ చేసినట్లుగా గుర్తించారు పోలీసులు. కాల్ చేసిన వ్యక్తిని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. నిందితుడు మద్యం మత్తులో ఫోన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమొదు చేసుకున్న పోలీసులు, విచారణ జరుపుతున్నారు.

Tags

Next Story