Crime News: భర్త అరాచకత్వం.. క్షుద్రపూజల పేరుతో భార్యకు బహిరంగ స్నానం..

Crime News: అంతరిక్షంలోకి రాకెట్లు పంపినా మనిషి ఆలోచనలు ఇంకా అధ:పాతాళంలోనే ఉన్నాయి. మాయలు, మంత్రాలు ఇంకా చెలామణీ అవుతున్నాయంటే మనిషి ఇంకా అజ్ఞానంలోనే బతుకుతున్నాడనేందుకు నిదర్శనాలు. క్షుద్రపూజల పేరుతో భార్యని నగ్నంగా చేసి అందరి ముందూ నిలబెట్టి స్నానం చేయించాడు ఓ చేతకాని భర్త.
ఒక మహిళను ఆమె భర్త మరియు అత్తమామలు బహిరంగ స్నానం చేయమని బలవంతం చేసిన సంఘటన పుణెలో జరిగింది. అప్పటికే అతడికి ఇద్దరు ఆడపిల్లలు.. మగపిల్లవాడు పుడితే వారసత్వం నిలబడుతుందని అత్తమామలతో పాటు భర్త బలవంతం చేశారు.
తాంత్రికుడు చెప్పినట్లు పూజలు చేయించారు. దీనిలో భాగంగానే ఆమెను నగ్నంగా స్నానం చేయించమని కోరాడు. భర్త, అత్తమామల బలవంత మీద ఒప్పుకుంది. ఊరందరి ముందు తన మాన మర్యాదలను మంటగలిపిన భర్త, అత్తమామల దుశ్చర్య గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పెళ్లైన నాటి నుంచి కట్నం కోసం అత్తింటి వారు వేధిస్తున్నారని, ఇప్పుడు మగబిడ్డ కోసం ఇలా చేశారని పోలీసులకు కన్నీళ్లతో తన బాధలను తెలిపింది ఆ ఇల్లాలు. ఇంకా, భర్త తన వ్యాపార ప్రయోజనాల కోసం రూ.75 లక్షల రుణం తీసుకునేందుకు తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని బాధితురాలు పోలీసుల ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com