Crime News: దుర్మార్గం.. పిల్లలు పుట్టట్లేదని భార్యను శ్మశానంలోకి తీసుకువెళ్లి..

Crime News: దుర్మార్గం.. పిల్లలు పుట్టట్లేదని భార్యను శ్మశానంలోకి తీసుకువెళ్లి..
Crime News: పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టట్లేదంటే ఎవరిలో లోపం ఉందో డాక్టర్ని అడిగి తెలుసుకోవాలి, ఆ మేరకు భార్యాభర్తలు ఇరువురు నడుచుకోవాలి.

Crime News: పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టట్లేదంటే ఎవరిలో లోపం ఉందో డాక్టర్ని అడిగి తెలుసుకోవాలి, ఆ మేరకు భార్యాభర్తలు ఇరువురు నడుచుకోవాలి.. కానీ ఆడవారిదే లోపం అని నిందించే వ్యక్తులు ఇంకా ఈ సమాజంలో ఉన్నారు. ఆ కారణంతో ఆమెపై కఠినంగా ప్రవర్తించే వారు కూడా ఉన్నారు. తాజాగా జరిగిన ఓ సంఘటన సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేసింది.


మహారాష్ట్ర పుణెకు చెందిన ఓ మహిళకు పిల్లలు పుట్టలేదని ఆమె చేత బలవంతంగా శ్మశానంలో మానవ ఎముకల పొడిని తినిపించారు. ఈ వార్త దావానంలా వ్యాపించి పోలీసులకు చేరింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుమారు ఏడుగురిపై అభియోగాలు మోపారు


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మహిళ అత్తమామలకు మూఢనమ్మకాలు ఉన్నాయి. వారు కోడలిని అమావాస్య రాత్రులు చేపట్టి పూజా కార్యక్రమాల్ల పాల్గొనమని బలవంతం చేస్తుంటారు. ఆచారంలో భాగంగానే మహిళను బలవంతంగా శ్మశానవాటికకు తీసుకెళ్లి ఎముకల పొడిని తినమని చెప్పారు.క్షుద్ర పూజలు నిర్వహించే వ్యక్తి మంత్రవిద్యలో భాగంగా మహిళ పౌడర్ చేసిన మానవ ఎముకలను తినవలసి వచ్చింది. మహిళ ఫిర్యాదు మేరకు పుణె పోలీసులు బుధవారం భర్త, అత్తమామలు, క్షుద్రపూజలు నిర్వహించిన వ్యక్తితో సహా ఏడుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
పుణె నగర పోలీసు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుహైల్ శర్మ మాట్లాడుతూ, "మూఢనమ్మకాల నిరోధక చట్టం సెక్షన్ 3తో పాటు ఐపిసి సెక్షన్ 498 ఎ, 323, 504, 506 కింద కేసు నమోదు చేశారు.మహిళ వేర్వేరు విషయాలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తన అత్తమామలు పెళ్లి సమయంలో (2019లో) నగదు, బంగారు మరియు వెండి ఆభరణాలు సహా కట్నం డిమాండ్ చేశారని ఆరోపించింది. ఇప్పుడు పిల్లలు పుట్టకపోవడానికి తానే కారణం అని భావించి బలవంతంగా శ్మశానంలోకి తీసుకువెళ్లి ఎముకల పొడి తినిపించిన విషయాన్ని వెల్లడించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story