హాస్టల్ భవనంపై నుంచి దూకి ఎంబీబీఎస్ విద్యార్ధిని మృతి

హాస్టల్ భవనంపై నుంచి దూకి ఎంబీబీఎస్ విద్యార్ధిని మృతి
రాజస్థాన్‌లో 21 ఏళ్ల వైద్య విద్యార్థిని తన కాలేజీ హాస్టల్ భవనంలోని ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

రాజస్థాన్‌లో 21 ఏళ్ల వైద్య విద్యార్థిని తన కాలేజీ హాస్టల్ భవనంలోని ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.విద్యార్థిని సుధాన్షి సింగ్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తన అరచేతిపై ఒక నోట్ రాసుకుంది. రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్ మెడికల్ కాలేజీకి చెందిన 21 ఏళ్ల విద్యార్థిని కళాశాల హాస్టల్ భవనంలోని ఆరో అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది.

హాస్టల్‌లోని కొందరు బాలికలు ఆమె బాత్‌రూమ్‌కు వెళ్లడం చూసారు. కానీ కొద్దిసేపటికే గది బాల్కనీ నుంచి కిందకు దూకింది. శబ్దం విన్న హాస్టల్‌లోని ఇతర బాలికలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ అప్పటికే ఆమె తల పగిలి రక్తం కారుతోంది.

దీంతో షాక్ తిన్న తోటి విద్యార్థినిలు సుధాన్షిని వెంటనే దుంగార్‌పూర్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. సమాచారం అందుకున్న దుంగార్‌పూర్‌ ఎస్పీ కుందన్‌ కన్వారియాతో పాటు మరికొందరు పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు.

ఈ విపరీతమైన చర్యకు ముందు, సుధాన్షి తన అరచేతిపై “ఇక నుండి, నేను ఏ తప్పు చేయను, నేను మీకు మాట ఇస్తున్నాను.. నన్ను క్షమించండి అమ్మ, నాన్న, సోదరుడు మరియు రోహిత్ అని రాసి ఉంది. ఆమె మృతదేహాన్ని ఆస్పత్రిలోని మార్చురీలో ఉంచి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హాస్టల్ సిబ్బంది, విద్యార్థుల నుంచి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. బాలిక తండ్రి ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story