రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసు.. వెలుగులోకి వస్తున్న వనమా రాఘవేంద్రరావు అకృత్యాలు

రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసు.. వెలుగులోకి వస్తున్న వనమా రాఘవేంద్రరావు అకృత్యాలు
Ramakrishna Suicide : కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవ అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవ అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈనెల 3న నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న కేసులో రాఘవ నిందితుడుగా ఉన్నాడు. ఐతే.. రామకృష్ణ ఆత్మహత్యకు ముందు రికార్డ్‌ చేసిన సెల్ఫీ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో రామకృష్ణ వెల్లడించిన అంశాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి.

తల్లి,అక్కతో తనకున్న ఆస్తి తగాదాలో భాగంగా రాఘవ దగ్గరకు వెళ్తే.. తనకు తీరని అన్యాయం చేశాడన్నారు. ఆస్తి రావాలంటే తన భార్యను పంపించాలని రాఘవ ఆర్డర్ వేశాడంటూ రామకృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తన భార్యను పంపిస్తే తప్ప ఆస్తి సమస్యకు పరిష్కారం లేదని వనమా రాఘవేంద్రరావు ఖరాఖండిగా చెప్పాడని రామకృష్ణ వాపోయాడు. ఏ సాయం చేసినా తనకేం లాభమో రాఘవ చూసుకుంటాడన్నాడు.

ఇక వీరితో పోరాడలేనని.. అందుకే తన కుటుంబాన్ని తీసుకెళ్తున్నానంటూ రామకృష్ణ సెల్ఫీ వీడియో ముగించాడు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో వనమా రాఘవేంద్రరావును A2గా చేర్చారు. ఐపీసీ సెక్షన్‌ 302, 306, 307 కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న రాఘవ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోగి దిగాయి. ఘటన జరిగి ఇన్ని రోజులవుతున్నా రాఘవ ఆచూకీ తెలియకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కేసు నుంచి రాఘవను తప్పించే ప్రయత్నం జరుగుతోంది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక పోలీసులకు దొరక్కుండా సేఫ్ ప్లేస్ లో తల దాచుకున్న రాఘవ... ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.Tags

Read MoreRead Less
Next Story