Hyderabad : విద్యార్ధి ఆత్మహత్యాయత్నానికి కారణం అదే..

Hyderabad : విద్యార్ధి ఆత్మహత్యాయత్నానికి కారణం అదే..
Hyderabad : హైదరాబాద్‌ రామంతాపూర్‌లోని నారాయణ కాలేజీ ఘటనపై విద్యాశాఖ అధికారులు సీరియస్ అయ్యారు.

Hyderabad : హైదరాబాద్‌ రామంతాపూర్‌లోని నారాయణ కాలేజీ ఘటనపై విద్యాశాఖ అధికారులు సీరియస్ అయ్యారు. కాలేజీ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. రామంతాపూర్ నారాయణ కాలేజీని సీజ్‌ చేసిన అధికారులు.. సీసీ ఫుటేజ్, హార్డ్ డిస్క్, అకౌంట్స్ వివరాలు ఇవ్వాలంటూ ఆదేశించారు. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఇక పోలీసుల అధినంలోనే నారాయణ కాలేజీ ఉంటుందని చెప్పారు అధికారులు. బయట వ్యక్తులు కాలేజీలోకి వెళ్లకుండా ఆదేశాలు ఇచ్చారు.

రామంతాపూర్ నారాయణ కాలేజీలో ఫీజు విషయంలో ఉదయం జరిగింది ఆత్మహత్యాయత్నం కాదని పోలీసులు తేల్చారు. బెదిరిద్దామని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టి ప్రమాదానికి దారి తీసిందని నిర్ధారించారు. రామాంతపూర్ నారాయణ కాలేజీ ప్రిన్సిపాల్ సుధాకర్‌కి... సాయి నారాయణ అనే విద్యార్థితో ఫీజు విషయంలో వాగ్వాదం నెలకొంది. ప్రిన్సిపాల్ వెనక్కితగ్గకపోవడంతో.. బాధిత స్టూడెంట్ విద్యార్థిసంఘం నాయకుడు సందీప్‌ను తీసుకుని కాలేజీకి వెళ్లాడు.

ఇక ప్రిన్సిపాల్‌ను బెదిరిద్దామనుకున్న స్టూడెంట్ లీడర్ సందీప్... వెంట తెచ్చుకున్న పెట్రోల్ తనపై పోసుకున్నాడు. ఇక అప్పటికే తన రూంలో పూజ చేసిన ప్రిన్సిపాల్.. దీపం పెట్టాడు. ప్రమాదవశాత్తు ఆ దీపం సందీప్‌కు తగిలి మంటలు చెలరేగాయని చెబుతున్నారు. ప్రమాదంలో విద్యార్థి నాయకుడు సందీప్‌తో పాటు ప్రిన్సిపాల్ సుధాకర్, ఏవో అశోక్‌రెడ్డికి గాయాలయ్యాయి. దీంతో వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story