MMTS: కదులుతున్న రైల్లో యువతిపై అత్యాచార యత్నం

MMTS: కదులుతున్న రైల్లో యువతిపై అత్యాచార యత్నం
X
కిందకు దూకేసిన యువతి... ఎంఎంటీఎస్ లో భయానక ఘటన

సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్లే ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం తీవ్ర కలకలం రేపింది. రైలు బోగీలో ఒంటరిగా ఉన్న యువతిపై ఓ యువకుడు అత్యాచారానికి యత్నించడంతో అతని నుంచి తప్పించుకునే క్రమంలో రైలు నుంచి బయటకు దూకిన యువతికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు అనంతపురం జిల్లాకు చెందిన యువతి (23)గా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని రాష్ట్ర జీఆర్పీ ఎస్పీ స్పందన దీప్తి పరామర్శించారు. ప్రస్తుతం యువతి ప్రాణాపాయం నుంచి బయటపడుతుందని వెల్లడించారు. నాలుగు ప్రత్యేక దళాలు ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

లేడీస్ కంపార్టమెంట్లోకి చొరబడి...

మేడ్చల్ లోని ఓ హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న యువతి.. మేడ్చల్ రైల్వేస్టేషన్​కు వెళ్లి అక్కడి నుంచి ఎంఎంటీఎస్ ట్రైన్​లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​ కు చేరుకుంది. తన సెల్​ఫోన్ రిపేరింగ్ చేయించుకుని తిరిగి సికింద్రాబాద్ నుంచి ఎంఎంటీఎస్​ లో మేడ్చల్ కు మహిళల కోచ్ ​లో బయలుదేరింది. అప్పటికే ఆ బోగీలో ప్రయాణిస్తు న్న ఇద్దరు మహిళలు.. అల్వాల్ రైల్వే స్టేషన్​లో దిగిపోయారు. అనంతరం ఆ కోచ్​లో ఆమె ఒక్కరే మిగిలిపోయారు. ఇది గమనించిన ఓ యువకుడు ఆమె వద్దకు వచ్చి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అతడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో యువతి నడుస్తున్న రైలు నుంచి బయటకు దూకేసింది. నడుస్తున్న ట్రైన్ నుంచి కిందకి దూకడంతో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడు యువతి పరిస్థితి స్థిరంగానే ఉన్నట్లు తెలుస్తోంది. బాధితురాలు వద్ద నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఆరా తీసిన బండి సంజయ్

ఎంఎంటీఎస్ నుంచి దూకి గాయాలపాలై గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతి కుటుంబ సభ్యులతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడారు. ప్రస్తుతం ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్న బండి సంజయ్ విషయం తెలిసిన వెంటనే ఆ యువతి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. యువతి కుటుంబ సభ్యులు అధైర్యపడొద్దని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఆ యువతికి మెరుగైన చికిత్స అందించేందుకు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలిస్తామని హామీ ఇచ్చారు.

Tags

Next Story