Hyderabad: మారేడ్‌పల్లి సీఐపై కేసు.. రేప్ చేశాడని బాధిత మహిళ కంప్లైంట్..!

X
By - Divya Reddy |9 July 2022 1:25 PM IST
Hyderabad: హైదరాబాద్ మారేడుపల్లి సీఐ నాగేశ్వరరావుపై అత్యాచార కేసు నమోదైంది. రేప్ చేశాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది.
Hyderabad: హైదరాబాద్ మారేడుపల్లి సీఐ నాగేశ్వరరావుపై వనస్థలిపురం.. పీఎస్‌లో అత్యాచార కేసు నమోదైంది. స్థానిక వెంకటరమణా కాలనీకి చెందిన ఓ మహిళ సీఐపై తీవ్ర ఆరోపణలు చేసింది. తన భర్త పై దాడి చేసి.. సీఐ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత తన భర్తతో పాటు తనను.. బలవంతంగా కారులో ఎక్కించుకొని ఇబ్రహీంపట్నం వైపు తీసుకెళ్లారని పేర్కొంది. అయితే మధ్యలో కారు రోడ్డు ప్రమాదానికి గురికావడంతో.. తమ ప్రాణాలు దక్కాయని తెలిపింది. లేకపోతే సీఐ తమను హత్య చేసేవాడని వెల్లడించింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com