Rapist Caught on TV5 Camera: తిరుపతిలో టీవీ5 కెమెరాకు చిక్కిన కామాంధుడు.. ఓ లాడ్జిలో..

Rapist Caught on TV5 Camera: తిరుపతిలో ఓ కామాంధుడి వేధింపుల పర్వం బట్టబయలైంది. కింది స్థాయి మహిళా ఉద్యోగులను వేధిస్తున్న రైల్వే సూపర్ వైజర్ దొరై అకృత్యాలపై టీవీ5 నిఘా పెట్టి... పోలీసులకు పట్టించింది. డ్యూటీలు వేస్తానంటూ మహిళా ఉద్యోగులను ప్రలోభపెట్టి... లైంగిక వాంఛ తీర్చుకుంటున్నాడు.
మాట వినని మహిళలను వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో బాధితురాలు... టీవీ5ను, మహిళా సంఘాలను ఆశ్రయించడంతో... అడ్డంగా బుక్కయ్యాడు. టీవీ 5 నిఘా నేత్రం దొరైను పట్టించడంతో మహిళా సంఘాలు అతడికి దేహశుద్ధి చేశాయి.
రైల్వే సూపర్ వైజర్‌గా పని చేస్తున్న దొరై... తిరుచానూరు ఆలయానికి సమీపంలోని ఓ లాడ్జిలో కింది స్థాయి ఉద్యోగినితో రెడ్ హ్యాండెడ్‌గా దొరికి పోయాడు. బాధితురాలి ఫిర్యాదుతో టీవీ5 కెమెరా నిఘా పెట్టి.. పట్టించింది.
తమను డ్యూటీల సాకుతో ప్రలోభపెట్టి... లైంగిక వాంఛ తీర్చుకుంటున్నాడని బాధితురాలు కన్నీళ్లు పెట్టుకుంది. మహిళా సంఘాలు కామాంధుడు దొరైకు దేహశుద్ధి చేసి.. పోలీసులకు అప్పగించారు. బాధితురాలి కంప్లైంట్‌పై నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు. బాధితులకు అండగా నిలిచిన టీవీ5కు మహిళా సంఘాలు అభినందనలు తెలిపాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com