Hyderabad: రేవ్ పార్టీ భగ్నం.. సినీ నిర్మాత వెంకట్ అరెస్ట్

Hyderabad: రేవ్ పార్టీ భగ్నం.. సినీ నిర్మాత వెంకట్ అరెస్ట్
కోకైన్‌, ఎల్‌ఎస్‌డీ, 70 వేల నగదు స్వాధీనం


హైదరాబాద్‌లో మళ్లీ డ్రగ్స్‌ కలకలం రేపుతున్నాయి. మాదాపూర్‌ విఠల్‌రావు నగర్‌లోని ఫ్రెష్‌లివింగ్‌ అపార్ట్‌మెంట్‌లో రేవ్‌ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. సినీ నిర్మాత, ఫైనాన్షియర్‌ వెంకట్‌ ఆధ్వర్యంలో ఈ పార్టీ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. నార్కోటిక్ అధికారులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ రేవ్ పార్టీలో వందల మంది డ్రగ్స్ సేవిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వెంకట్‌తో పాటు పలువురు ప్రముఖులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరందరిని మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. వెంకట్...... ఢమరుకం, పూలరంగడు, లవ్లీ, ఆటోనగర్‌ సూర్య చిత్రాలకు ఫైనాన్షియర్‌గా వ్యవహరించాడు. అతనితో పాటు పట్టుబడిన బాలాజీ, కె.వెంకటేశ్వర్ రెడ్డి, మురళి, మధుబాల, మెహక్‌ల నుంచి కోకైన్‌, ఎల్‌ఎస్‌డీ, 70 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిలో సినీ పరిశ్రమకు చెందిన యువతులు సైతం తెలుస్తోంది. డ్రగ్స్‌ ఎవరు సరఫరా చేశారనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

రేవ్ పార్టీ ఒక్కసారిగా కలకలం రేపడంతో ... విచారణ వేగవంతం చేశారు అధికారులు. ఈ క్రమంలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. నార్కోటిక్ బ్యూరో..... వెంకట్ కదిలికలపై గత మూడు నెలలుగా నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే.. వెంకట్ ఆధ్వర్యంలో డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్నట్లు నిర్ధారించుకున్నారు. గోవా నుండి డ్రగ్స్ తెచ్చి వెంకట్‌ డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే మరో నిందితుడు బాలాజీ పై గతంలోనూ కేసులు ఉన్నట్లు గుర్తించారు. వెంకట్ కు డ్రగ్స్ పెడలర్లు సంబంధాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. వెంకట్ వాట్సాప్‌లో డ్రగ్స్ పార్టీ పై చాటింగ్ చేసినట్లు గుర్తించారు.

Tags

Read MoreRead Less
Next Story