గుట్టల్లో దెయ్యం.. భయపడి చస్తున్న జనం!

గుట్టల్లో దెయ్యం.. భయపడి చస్తున్న జనం!
తెల్లని ముసుగతో.. స్లో మోషన్ నడకతో.. చూడగానే భయపడేలా ఉంది.

దెయ్యం ఎప్పుడైనా చూశారా? పోనీ చూడాలనుకుంటున్నారా? అచ్చం హాలీవుడ్ సినిమాల్లో కనిపించే సీన్.. మహబూబాబాద్‌ జిల్లాలో కనిపిస్తోంది. తెల్లని ముసుగతో.. స్లో మోషన్ నడకతో.. చూడగానే భయపడేలా సీన్ క్రియేట్ చేశారు.

ఈ దెయ్యం మహబూబాబాద్ జిల్లా జంగిలిగొండ గ్రామశివారులోని గుట్టల వద్ద తిరుగుతోంది. ఎవరో కావాలని చేస్తున్నారని చాలా క్లియర్‌గా తెలుస్తున్నా సరే.. ఈ దృశ్యాలు చూసిన జనాలు భయపడుతున్నారు.

జంగిలిగొండ స్టేజీ నుంచి VS లక్ష్మీపురం, నర్సింహులపేట, కౌసల్యాదేవిపల్లి గ్రామాలకు ఈ రోడ్డు మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. అయితే, గత 15 రోజులుగా ఈ ప్రాంతంలో దెయ్యం తిరుగుతోందని ప్రచారం జరగడంతో.. రాత్రిళ్లు బయటికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. చివరికి పొలాలకు వెళ్లాలన్నా సరే స్థానికులు వణికిపోతున్నారు.

ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు, అధికారులు వచ్చి.. తమ ప్రాంతాన్ని సందర్శించి.. వైరల్ అవుతున్న ఈ దెయ్యం సంగతి చూడాలని అభ్యర్ధిస్తున్నారు. అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి.. భయాలను పోగొట్టాలని వేడుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story