Bribe: 32 ఏళ్ల క్రితం రూ.100లు లంచం తీసుకున్నందుకు.. రిటైర్డ్ ఉద్యోగికి జైలు శిక్ష

Bribe: 32 ఏళ్ల క్రితం రూ.100లు లంచం తీసుకున్నందుకు.. రిటైర్డ్ ఉద్యోగికి జైలు శిక్ష
Bribe: వేలు, లక్షలు లంచం తీసుకున్న వాళ్లు బాగానే ఉంటారు.. పాపం రూ.100లు లంచం తీసుకున్నందుకు అడ్డంగా బుక్కైపోయారు.

Bribe: వేలు, లక్షలు లంచం తీసుకున్న వాళ్లు బాగానే ఉంటారు.. పాపం రూ.100లు లంచం తీసుకున్నందుకు అడ్డంగా బుక్కైపోయారు. ఈ విషయం కాస్తా కోర్టు కెక్కింది.. తీర్పు 32 ఏళ్ల తరువాత వచ్చింది. ఇప్పుడు అతడి వయసు 82 ఏళ్లు. ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.

లక్నోలోని ప్రత్యేక న్యాయస్థానం 32 ఏళ్ల క్రితం లంచం తీసుకున్న కేసులో తీర్పు వెలువరించింది. రూ. 100 లంచం తీసుకున్నందుకు 82 ఏళ్ల రిటైర్డ్ రైల్వే ఉద్యోగికి ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది. అతడికి ఏడాది జైలు శిక్ష విధించింది. వయసు కారణంగా తక్కువ శిక్ష వేయాలని కోరుతున్నారు అతడి కుటుంబసభ్యులు.

వృద్ధాప్యం కారణంగా తక్కువ శిక్ష విధించాలని కోరుతున్న దోషికి సానుభూతి చూపేందుకు సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ విక్రమ్ సింగ్ నిరాకరించారు. అలా చేయడం సమాజానికి తప్పుడు సందేశాన్ని ఇచ్చినట్లవుతుందని అభిప్రాయపడ్డారు.

దోషి రామ్ నారాయణ్ వర్మకు కోర్టు రూ. 15,000 జరిమానా విధించింది. ఈ ఘటన 32 ఏళ్ల క్రితం జరిగిందని, ఆ సమయంలో తాను రెండు రోజులు జైలు జీవితం గడిపానని వర్మ కోర్టుకు విన్నవించారు.

పిటిషన్‌ను తిరస్కరించిన న్యాయమూర్తి, ఈ కేసులో రెండు రోజుల జైలు శిక్ష సరిపోదని, లంచం తీసుకోవడం నేరం.. కావునా ఒక సంవత్సరం జైలు శిక్ష ఉండాలని అన్నారు.

1991లో ఏం జరిగింది?

నార్తర్న్ రైల్వేస్‌కి చెందిన రిటైర్డ్ లోకో డ్రైవర్ రామ్ కుమార్ తివారీ 1991లో కేసు నమోదు చేశారు. తివారీ పెన్షన్ కోసం వస్తే.. వర్మ రూ.150 లంచం డిమాండ్ చేశాడు. అంత ఇచ్చుకోలేనంటే కనీసం రూ. 100 లు అయినా ఇవ్వమని అడిగారు.

లంచం తీసుకుంటున్న క్రమంలో వర్మను సీబీఐ రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేసింది. విచారణ పూర్తయిన తర్వాత వర్మపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. నవంబర్ 30, 2022న నిందితులపై కోర్టు అభియోగాలు మోపింది.

Tags

Read MoreRead Less
Next Story