RICH BEGGAR: ఓ యాచకుడి ఆస్తుల సామ్రాజ్యం

RICH BEGGAR: ఓ యాచకుడి ఆస్తుల సామ్రాజ్యం
X
బిచ్చగాడి ఆస్తులు చూసి అధికారుల షాక్.... మూడు మేడలు, కార్లు, ఆటో రిక్షాలు... బ్యాంకు ఖాతాల్లో లక్షల్లో నగదు

చి­రి­గి­పో­యిన దు­స్తు­లు… చే­తి­లో చక్రాల బండి… దా­ని­పై కూ­ర్చు­ని రో­జం­తా భి­క్షా­టన… చూ­సే­వా­రె­వ­రై­నా “దయ­నీ­య­మైన ది­వ్యాం­గు­డు” అను­కు­నే­లా కని­పిం­చే ఒక వ్య­క్తి జీ­వి­తం వెనక, ఊహ­కం­ద­ని ఆస్తుల సా­మ్రా­జ్యం దాగి ఉం­దం­టే నమ్మ­గ­ల­రా? మధ్య­ప్ర­దే­శ్‌­లో­ని ఇం­దౌ­ర్ నగ­రం­లో తా­జా­గా బయ­ట­ప­డిన ఈ ఘటన, అధి­కా­రు­ల­తో పాటు ప్ర­జ­ల­ను కూడా వి­స్తు­పో­యే­లా చే­సిం­ది. ఇం­దౌ­ర్‌­ను “బి­చ్చ­గా­ళ్లు లేని నగరం”గా మా­ర్చా­ల­న్న లక్ష్యం­తో నగర పాలక సం­స్థ, సా­మా­జిక సం­క్షేమ శా­ఖ­లు కలి­సి ప్ర­త్యేక డ్రై­వ్‌­ను చే­ప­ట్టా­యి. ఈ డ్రై­వ్‌­లో భా­గం­గా నగ­రం­లో­ని ప్ర­ధాన కూ­డ­ళ్లు, మా­ర్కె­ట్లు, దే­వా­ల­యాల పరి­స­రా­ల్లో భి­క్షా­టన చే­స్తు­న్న వా­రి­ని గు­ర్తిం­చి, వా­రి­కి కౌ­న్సె­లిం­గ్ ఇస్తూ పు­న­రా­వాస కేం­ద్రా­ల­కు తర­లి­స్తు­న్నా­రు. ఇప్ప­టి­వ­ర­కు సు­మా­రు 6,500 మం­ది­ని గు­ర్తిం­చి, వారి నే­ప­థ్యా­ల­ను పరి­శీ­లిం­చి­న­ట్లు అధి­కా­రు­లు వె­ల్ల­డిం­చా­రు. ఈ క్ర­మం­లో నగ­రం­లో­ని రద్దీ­గా ఉండే సరా­ఫ్ బజా­రు ప్రాం­తం­లో, చక్రాల బం­డి­పై కూ­ర్చు­ని భి­క్షా­టన చే­స్తు­న్న మం­గీ­లా­ల్ అనే ది­వ్యాం­గు­డి­పై అధి­కా­రుల దృ­ష్టి పడిం­ది. . మొదట ఇత­డి­ని కూడా మి­గ­తా భి­క్షా­టన చేసే వా­రి­లా­గే పు­న­రా­వాస కేం­ద్రా­ని­కి తర­లిం­చేం­దు­కు అధి­కా­రు­లు ప్ర­య­త్నిం­చా­రు. కానీ వి­చా­రణ మొ­ద­లైన కొ­ద్ది­సే­ప­టి­కే, ఒక్కొ­క్క­టి­గా బయ­ట­ప­డిన ని­జా­లు అధి­కా­రు­ల­నే కాదు, ఆ ప్రాంత ప్ర­జ­ల­ను కూడా నోట మాట రా­నం­త­గా చే­శా­యి.

మేడలు, కార్లు

మం­గీ­లా­ల్‌­కు ఇం­దౌ­ర్ నగ­రం­లో­నే మూడు మేడ భవ­నా­లు ఉన్న­ట్లు గు­ర్తిం­చా­రు. వీ­టి­లో ఒక భవ­నా­న్ని తాను ది­వ్యాం­గు­డి­న­ని చూ­పి­స్తూ, రె­డ్‌­క్రా­స్ సొ­సై­టీ నుం­చి ఉచి­తం­గా పొం­ది­న­ట్టు అధి­కా­రు­లు ని­ర్ధా­రిం­చా­రు. మి­గి­లిన రెం­డు భవ­నా­లు కూడా పూ­ర్తి­గా అతడి పే­రి­టే నమో­దై ఉం­డ­టం సం­చ­ల­నం రే­పిం­ది.సరా­ఫ్ బజా­రు­లో­ని కొం­త­మం­ది బం­గా­రం వర్త­కు­ల­కు మం­గీ­లా­ల్ భారీ మొ­త్తా­ల్లో వడ్డీ­కి డబ్బు­లు ఇచ్చి­న­ట్లు అధి­కా­రుల దర్యా­ప్తు­లో బయ­ట­ప­డిం­ది.మం­గీ­లా­ల్ ఇం­దౌ­ర్ నగ­రం­లో మా­త్రం చక్రాల బం­డి­పై భి­క్షా­టన చే­స్తూ కని­పి­స్తా­డు. కానీ నగరం దా­టిన తర్వాత అతడి జీ­వ­న­శై­లి పూ­ర్తి­గా మా­రి­పో­తుం­ది. బయట ప్రాం­తా­ల­కు వె­ళ్లే­ట­ప్పు­డు అతడు స్వి­ఫ్ట్ డి­జై­రు కారు వి­ని­యో­గి­స్తా­డు. ఆ కా­రు­కు ప్ర­త్యేక డ్రై­వ­ర్ కూడా ఉన్న­ట్లు అధి­కా­రు­లు గు­ర్తిం­చా­రు. అం­తే­కా­దు, అతడి పే­రిట మూడు ఆటో­రి­క్షా­లు ఉం­డ­గా, వా­టి­ని అద్దె­ల­కు తి­ప్పు­తూ నె­ల­కు మంచి ఆదా­యం పొం­దు­తు­న్నా­డ­ని తే­లిం­ది. అధి­కా­రు­లు మరింత లో­తు­గా దర్యా­ప్తు చే­స్తు­న్నా­రు.

ఇది కేవలం మంగీలాల్‌ ఒక్కరి కథ మాత్రమే కాదని చెబుతున్నారు. భిక్షాటన ముసుగులో ఆస్తులు కూడబెట్టే వారి సంఖ్య ఊహించిన దానికంటే ఎక్కువే ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు సంబంధిత అధికారి దినేష్ మిశ్ర తెలిపారు. మంగీలాల్‌కు సంబంధించిన ఆస్తుల మూలాలు, డబ్బు లావాదేవీలు, అక్రమంగా పొందిన లాభాలపై సమగ్ర విచారణ కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. ఈ ఘటన, భిక్షాటన అనేది నిజంగా అవసరంలో ఉన్నవారికే పరిమితమా? లేక కొందరు దీన్ని ఒక వ్యాపారంగా మార్చుకున్నారా? అనే ప్రశ్నలకు తెరలేపుతోంది. అలాగే ప్రభుత్వ పథకాలను దుర్వినియోగం చేస్తున్న వారి పట్ల కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Tags

Next Story