Khammam: క్షుద్రపూజలను నమ్మి ఆర్‌ఎంపీ అరాచకం.. భార్యను వేరొకరికి..

Khammam: క్షుద్రపూజలను నమ్మి ఆర్‌ఎంపీ అరాచకం.. భార్యను వేరొకరికి..
Khammam: ఈ పిచ్చివేషాలు పీక్స్‌కి చేరడంతో చివరికి భార్యే ఇంటి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Khammam: ఆరెంపీ వైద్యుడు కూడా మంత్రాలకు చింతకాయలు రాలతాయని నమ్మితే ఏమనాలి..! నాడి పట్టి, నాలుగు ఇంజెక్షన్లు చేసి రోగులకు మందులిస్తే డబ్బులొస్తాయి కాని.. హస్తవాసి బాగుండాలని క్షుద్రపూజలు చేయించుకుంటే రాత మారుతుందా..? ఖమ్మం జిల్లా మధిరలో ఓ RMP వెకిలి చేష్టల వ్యవహారం తెలిస్తే మీరు కూడా అతన్ని ఉతికి ఆరేయాలని ఫిక్సవుతారు.

భార్య శీలాన్ని వేరొకరికి సమర్పిస్తే నట్టింట్లో సిరితాండవం చేస్తుందని ఎవడో చెప్పడమేంటి.. దాన్ని నమ్మి క్షుద్రపూజలు చేసి, ఆమె జీవితంతో ఆటలు ఆడాలనుకోవడం ఏంటి..? ఈ పిచ్చివేషాలు పీక్స్‌కి చేరడంతో చివరికి భార్యే ఇంటి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లా మధిరకు చెందిన ఆర్ఎంపీ శ్రీనివాస్‌కు పదేళ్ల క్రితం వివాహం అయింది.

భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నాడు. ఓ స్నేహితుడు క్షుద్ర పూజలు చేస్తే గ్రహస్థితి బాగుపడి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని సలహా ఇచ్చాడు. దీంతో కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం వజినేపల్లికి చెందిన పూజారిని సంప్రదించాడు ఆర్ఎంపీ. పూజల అనంతరం ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధనవంతుడివి అవుతావని చెప్పి పూజా విధానం తెలియజేశాడా పూజారి.

అందుకు అంగీకరించిన ఆర్ఎంపీ.. తన ఇంట్లో భార్య చేత క్షుద్ర పూజలు చేయించాడు. అనంతరం పూజారితో సంసారం చేయమని ఒత్తిడి చేశాడు. దీనికి ససేమిరా అన్న భార్య ఇంట్లోనుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story