భార్యను చంపి భర్త ఆత్మహత్య

భార్యను చంపి భర్త ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా నార్సింగ్‌లో దారుణం జరిగింది. జన్వాడలో భార్యను ఆర్ఎంపీ డాక్టర్ హత్య చేశాడు. తర్వాత తాను ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా నార్సింగ్‌లో దారుణం జరిగింది. జన్వాడలో భార్యను ఆర్ఎంపీ డాక్టర్ హత్య చేశాడు. ఆ తర్వాత తాను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మియాఖాన్‌గడ్డలో ఆర్ఎంపీ డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న నాగరాజు దంపతులకు ఇద్దరు పిల్లలు. ఘటనకు ముందు అమ్మానాన్నలు గొడవ పడ్డారని తొమ్మిదేళ్ల కొడుకు చెబుతున్నాడు. తనను చంపేందుకు తండ్రి ప్రయత్నించగా తమ్ముడిని తీసుకొని పారిపోయానని చెప్పాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ కలహాల కారణంగానే నాగరాజు తన భార్యను చంపి తాను సూసైడ్ చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story