దొంగల బీభత్సం.. ఒకేసారి ఏడు షాపుల్లో చోరీ

దొంగల బీభత్సం.. ఒకేసారి ఏడు షాపుల్లో చోరీ
ఒకేసారి ఏడు షాపుల్లో చోరీ జరగడం స్థానికంగా కలకల రేపుతోంది.

వికారాబాద్‌ జిల్లాలోని పరిగి గంజ్‌ రోడ్‌లో దొంగలు రెచ్చిపోయారు. భారీ చోరీకి తెగబడ్డారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఏడు దుకాణాలను రాత్రికి రాత్రే కొల్లగొట్టారు. షెటర్లు విరగ్గొట్టి చోరీకి పాల్పడ్డారు.

వరుసగా ఉన్న బంగారం దుకాణం, రెండు చెప్పుల షాపులు, కిరాణా, బట్టల షాపుల్లో దొంగతనం చేశారు. వ్యాపారుల ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యప్తు చేస్తున్నారు. అయితే ఒకేసారి ఏడు షాపుల్లో చోరీ జరగడం స్థానికంగా కలకల రేపుతోంది. గ్రూప్‌గా ఒకేసారి ఈ చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.Tags

Read MoreRead Less
Next Story