ROBBERY: గన్నులు గురిపెట్టారు... రూ. కోటీ కొల్లగొట్టారు

ROBBERY: గన్నులు గురిపెట్టారు... రూ. కోటీ కొల్లగొట్టారు
బిహార్‌లో యాక్సిస్‌ బ్యాంక్‌లో భారీ చోరీ... పాయింట్‌ బ్లాంక్‌లో గన్నుపెట్టి రూ. కోటి చోరి చేసిన దుండగులు...

బిహార్‌(BIHAR)లో పట్టపగలే భారీ దోపిడి(ROBBERY) జరిగింది. వైశాలి జిల్లా లాల్‌గంజ్‌లోని యాక్సిస్ బ్యాంకు( Axis bank‌)లో దాదాపు కోటి రూపాయల‍(Rs 1 crore robbed‌)కు పైగా నగదు దొంగతనం జరిగినట్లు పోలీసులు తెలిపారు. రెండు వాహనాలపై వచ్చిన ఐదుగురు దుండగులు పెద్ద మెుత్తంలో నగదును ఎత్తుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. త‌మ వ‌ద్ద ఉన్న తుపాకుల‌తో బ్యాంకు ఉద్యోగులు, ఖాతాదారుల‌ను బెదిరించి(gunpoint), న‌గ‌దును దోచుకెళ్లారు.


బ్యాంకులోని సీసీటీవీ కెమేరాల(CCTV footage )ను దుండగులు ధ్వంసం చేసినట్లు తెలిపారు. సీసీటీవీ హార్డ్ డిస్క్ ను సైతం దుండగులు ఎత్తుకెళ్లినట్లు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. చుట్టుపక్కల ప్రాంతాల సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. దొంగ‌లు త‌మ ముఖాల‌కు మాస్కులు ధ‌రించారు.

నిందితులు ముఖానికి మాస్క్‌లు ధరించి హెల్మెట్‌లు పెట్టుకుని, చేతిలో పిస్టల్స్, బ్యాగుల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీని వైశాలి పోలీసులు విడుదల చేశారు. బ్యాంకులో సెక్యూరిటీ గార్డులు ఉన్నారని, కానీ వారి వద్ద ఆయుధాలు లేవని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story