హత్యాచార నిందితుడు రాజు ఫ్యామిలీ హిస్టరీ

హత్యాచార నిందితుడు రాజు ఫ్యామిలీ హిస్టరీ
నిందితుడు పల్లకొండ రాజు కోసం.. పోలీసులు అతడి అత్తగారి ఊరు సూర్యాపేట జిల్లా, జలాల్‌పురం సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో..

హైదరాబాదులోని సింగరేణి కాలనీ లో మైనర్ బాలిక చిన్నారి బాలిక పై అత్యాచారం హత్య చేసిన నిందితుడు రాజు ఫ్యామిలీ లో క్రైమ్ హిస్టరీ ఉన్నట్లు తెలుస్తుంది. నిందితుడు పల్లకొండ రాజు కోసం.. పోలీసులు అతడి అత్తగారి ఊరు సూర్యాపేట జిల్లా, జలాల్‌పురం సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో బుధవారం గాలింపు చేపట్టారు. అతని సంబంధీకులను ఆరా తీశారు.

రాజు భార్య ప్రసవం కోసం ఏడాది క్రితం పుట్టింటికి వచ్చి, ఇక్కడే ఉంటున్నట్టు తెలుసుకున్నారు. అతను అప్పుడప్పుడు వచ్చేవాడని, రెండు వారాల క్రితం జలాల్‌పురానికి వచ్చి కూలి పనులు చేశాడని సంబంధీకులు, స్థానికులు తెలిపారు. ఒకరోజు తాగిన మైకంలో అత్తపై చేయిచేసుకున్నాడని, కుటుంబ సభ్యులు దాడి చేస్తారని భయంతో మళ్లీ హైదరాబాద్‌కు పారిపోయాడని వివరించారు.

మరోవైపు 2019 మార్చి నుంచి 2020 ఏప్రిల్ వరకు సూర్యాపేటలోని ఇటుకల తయారీ కంపెనీలలో నిందితుడు రాజు రోజు కూలీగా పని చేసినట్లు తెలుస్తోంది. సూర్యాపేట నుంచి హైదరాబాదుకు మకాం మార్చిన సమయంలో చివరగా.. సూర్యాపేట లోని తాళ్లగడ్డ లోని శ్రీ విజయ లక్ష్మి ట్రేడర్స్ లో పని చేసాడని ఇటుకల తయారీ కంపెనీ ఓనర్ చెబుతున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story