Hyderabad: HDFCలో భారీ మోసం.. ఉద్యోగుల చేతివాటం

Hyderabad: HDFCలో భారీ మోసం.. ఉద్యోగుల చేతివాటం
క్రెడిట్ కార్డు వివరాలు సేకరించి ఖాతాలో డబ్బు కొట్టేశారు


హైదరాబాద్‌లో బయటపడ్డ మరో భారీ సైబర్ మోసం బయటపడింది.వందల సంఖ్యలో బాధితులు లబోదిబో అంటున్నారు,బాధితుల నుంచి కోట్లు కొల్లగొట్టింది ఓ ముఠా.ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో యువతకు గాలం వేసి ఫేక్ ఉద్యోగాలు క్రియేట్ చేసి వాళ్ల పేరున లక్షల్లో లోన్లు తీసుకున్నారు.HDFC బ్యాంక్‌లో ఒక్కొక్కరి పేరున 30 నుంచి 40 లక్షల లోన్లు తీసుకున్నట్లు సమాచారం. ఈ స్కామ్‌లో బ్యాంక్ ఉద్యోగుల హస్తం ఉన్నట్లు బయటపడింది.కేసు నమోదు చేసికున్న పోలీసుల ఇద్దరు బ్యాంక్ ఉద్యోగులను అదుపులో తీసుకున్నారు.SBI,యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లను టార్గెట్ చేసిన మరో ముఠా కాల్ స్ఫూఫింగ్‌తో అకౌంట్‌ హోల్డర్స్‌కి కాల్స్ వస్తున్నాయి. క్రెడిట్ కార్డు వివరాలు సేకరించి ఖాతాలో డబ్బు కొట్టేశారు. ఈ వ్యవహారాలు ఢిల్లీ కేంద్రంగా జరిగినట్లు గుర్తించారు. ఈ కేసులో మొత్తం 12 మంది అరెస్ట్ చేయగా, మరో నలుగురు పరారీ ఉన్నారు.ఈ ముఠాపై దేశవ్యాప్తంగా 1200కి పైగా కేసులు నమోదు అయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story