Kakinada: 9వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.. స్కూల్ కరెస్పాండెంటే నిందితుడు..

Kakinada: కాకినాడలో 9వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. స్కూల్ కరెస్పాండెంట్ విజయ్ కుమారే విద్యార్ధినిపై పలుమార్లు అత్యాచారం చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. కాకినాడ కొండయ్యపాలెంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో చదువుతున్న విద్యార్ధిని.. అక్కడి దగ్గర్లోని హాస్టల్‌లో ఉంటోంది. కరోనా మందు పేరుతో మత్తు మందు ఇచ్చి విద్యార్ధినిపై అత్యాచారం చేశాడు. ఆ తరువాత పలుమార్లు విద్యార్థిని భయపెట్టి, బెదిరించి లోబరుచుకున్నాడు కరెస్పాండెంట్ విజయ్ కుమార్.
సెలవులకు ఇంటికి వచ్చిన కూతురికి తీవ్ర రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులు కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. గర్భస్రావం జరిగిందని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు షాక్ తిన్నారు. అసలేం జరిగిందనే దానిపై తమ కూతురిని ఆరా తీశారు. కరెస్పాండెంట్ చేసిన అఘాయిత్యం గురించి చెప్పడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం విజయ్ కుమార్ పరారీలో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com