కామారెడ్డిలో కీచకుడిగా మారిన ప్రధానోపాధ్యాయుడు

X
By - Nagesh Swarna |4 March 2021 11:37 AM IST
తనకు నచ్చింది చూపించాలంటూ హెడ్ మాస్టర్ వేధింపులకు గురిచేస్తున్నాడు
సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన ఓ ప్రధానోపాధ్యాయుడు విద్యార్ధినితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆవీడియో కాస్తా వైరల్‌గా మారడంతో విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ ఘటన కామారెడ్డి జిల్లాకేంద్రంలో చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో హెడ్ మాస్టర్‌గా పనిచేస్తున్న దీప్లా రాథోడ్ .. విద్యార్ధినిలకు వాట్సాప్ కాల్ చేస్తూ.. తనకు నచ్చింది చూపించాలంటూ వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో విద్యార్ధులు, విద్యార్ధి సంఘ నాయకులు పాఠశాల ఎదుట భైఠాయించి ఆందోళన చేపట్టారు. కీచక ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com