క్రైమ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బయటపడ్డ కీచక టీచర్ అకృత్యాలు

తండ్రి లాగా చూడాల్సిన ఉపాధ్యాయుడే వక్రబుద్ధితో ప్రవర్తరించాడు. పాఠశాలలో చదువుకుంటున్న చిన్నారులపై కన్ను వేశాడు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బయటపడ్డ కీచక టీచర్ అకృత్యాలు
X

విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే కీచకుడిగా మారాడు. తండ్రి లాగా చూడాల్సిన ఉపాధ్యాయుడే వక్రబుద్ధితో ప్రవర్తరించాడు. దొడ్డ సునీల్ అనే వ్యక్తి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్షిదేవిపల్లి మండలం చింతవర్రే గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో పాఠశాలలో చదువుకుంటున్న చిన్నారులపై కన్ను వేశాడు. శారీరకంగా వేధిస్తూ కామాంధుడిగా మారాడు. కొన్నిరోజులుగా పిల్లలు అనారోగ్యంతో బాధపడడం.. పాఠశాలకు వెళ్లమంటే భయపడుతుండడంతో తల్లిదండ్రులు ఆరా తీయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

దీంతో కామాంధుడికి దేహశుద్ధి చేసిన స్థానికులు.. పోలీసులు, విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులు నిందితుడిని సస్పెండ్ చేశారు. మొత్తం ఐదుగురు చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడ్డాడని గుర్తించిన పోలీసులు.. పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి అదుపులోకి తీసుకున్నారు. చిన్నారుల జీవితాలతో ఆడుకున్న కీచక ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story

RELATED STORIES