కీచక టీచర్‌.. నగ్నంగా వీడియోలు కావాలంటూ బాలికను..

కీచక టీచర్‌.. నగ్నంగా వీడియోలు కావాలంటూ బాలికను..

Representational image

School Teacher Misbehaves: విద్యార్థులను ప్రయోజకులను చేయాల్సిన గురువులే దారి తప్పుతున్నారు.

School Teacher Misbehaves: విద్యార్థులను ప్రయోజకులను చేయాల్సిన గురువులే దారి తప్పుతున్నారు. సంగారెడ్డికి చెందిన ఓ మైనర్‌ బాలికను.. ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్‌ వేధింపులకు గురిచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డికి చెందిన బాలిక స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఇంటర్‌ చదువుతోంది. అదే సంస్థకు చెందిన పాఠశాలలో ఆమె టెన్త్‌ పూర్తి చేసింది. ఆ స్కూల్లో టీచర్‌ గా పనిచేస్తున్న వినయ్‌ రాజ్‌.. ఏడాది కాలంగా విద్యార్థినిని వేధించడం మొదలు పెట్టాడు. ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో ఫోన్ నెంబర్‌ తీసుకున్న వినయ్‌ రాజ్‌ అప్పటి నుంచి ఆమెకు అభ్యంతర మేసేజ్‌లు, ఫోటోలు పెడుతూ వెకిలి చేష్టలు చేస్తున్నాడు.

ప్రస్తుతం బాధిత విద్యార్థిని ఇంటర్‌ చదువుతున్నా.. వినయ్‌ రాజ్‌ వేధింపులు మాత్రం ఆపలేదు. నగ్నంగా ఉన్న వీడియోలు పంపించాలని.. లేకపోతే ఆమె చదువుతున్న కాలేజ్‌ లెక్చరర్లకు చెప్పి ఫెయిల్‌ చేయిస్తానని భయబ్రాంతులకు గురి చేశాడు. పెద్ద గొడవ అవుతుందని భయపడి ఏడాది కాలంగా వినయ్‌ రాజ్‌ వేధింపులను భరించిన బాలిక.. అతడి చేష్టలు రోజు రోజుకీ శృతి మించడంతో తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే బాధితులు సంగారెడ్డి పీఎస్‌లో కంప్లైంట్‌ చేశారు. సెల్‌ఫోన్‌ చాటింగ్‌ ఆధారంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్కూల్లో ఇంకా ఎవరైనా వినయ్‌ రాజ్‌ బాధితులు ఉన్నారా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇంత జరిగినా స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ మాత్రం తమకు ఏమీ తెలియదని చెబుతోంది. ఆడపిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గతంలో ఇలాంటి ఫిర్యాదులు వచ్చినా స్కూల్‌ మేనేజ్‌మెంట్ సీరియస్‌గా తీసుకోలేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్కూల్‌ యాజమాన్యంపై కూడా దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story