Secunderabad : సికింద్రాబాద్ అగ్ని ప్రమాదానికి కారణమిదే..?

X
By - Sai Gnan |13 Sept 2022 8:00 PM IST
Secunderabad : సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి సీసీపుటేజ్ బయటకు వచ్చింది
Secunderabad : సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి సీసీపుటేజ్ బయటకు వచ్చింది. సీసీ పుటేజ్‌లో ప్రమాదపు దృశ్యాలు కూడా రికార్డు అయ్యాయి. ఎలక్ట్రిక్ బైక్ వల్లే అగ్నిప్రమాదం జరిగిందని పోలీసులు తేల్చారు. మొదట ఎలక్ట్రిక్ బైక్ నుంచి పొగలు వచ్చాయని, ఆ తర్వాతే పేలుడు జరిగిందని చెప్పారు. రాత్రి 9గంటల 17నిమిషాలకు బైక్‌లో పొగ వచ్చిందని.. ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే పేలుడు జరిగిందని పోలీసులు తేల్చారు.
ఊపిరి ఆడకపోవడంతో ఘటనలో 8 మంది మృతి చెందారని చెబుతున్నారు. బిల్డింగ్ యజమానిపై కేసు నమోదు చేశామని, ప్రస్తుతం ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేశారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com