Hyderabad : హైదరాబాద్‌లో రియల్టర్‌ హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

Hyderabad :  హైదరాబాద్‌లో రియల్టర్‌ హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
X
Hyderabad : హైదరాబాద్‌ తిరుమలగిరి కారు మృతదేహం కేసులో పలు సంచలన విషయాలు బయటపడుతున్నాయి.

Hyderabad : హైదరాబాద్‌ తిరుమలగిరి కారు మృతదేహం కేసులో పలు సంచలన విషయాలు బయటపడుతున్నాయి. రియల్టర్‌ విజయ‌భాస్కర్‌ను హత్య చేసి కారులో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. రియల్‌ ఎస్టేట్‌ నిర్వహిస్తున్న విజయభాస్కర్‌కు పలువురితో వ్యాపార విభేదాలు ఉన్నాయి. ఈ హత్యకు వ్యాపార లావాదేవీలే కారణమని ప్రాథమికంగా పోలీసులు తేల్చారు. కాల్‌డేటా ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు... పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. కారులో హత్య చేశారా, లేక ఎక్కడైనా హత్యచేసి అల్వాల్‌లో వదిలేశారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక అందిన తర్వాత.. దాని ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.

Tags

Next Story