Shadnagar: కన్న తండ్రి కాదు కామాంధుడు

షాద్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. పేగు బంధాన్ని మరిచిన ఓ కామాంధుడు కన్నకూతురని కూడా చూడకుండా ఆ చిన్నారి పై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ చిన్నారి గర్భం దాల్చింది.
పోలీసులు కథనం మేరకు.. గత కొన్ని నెలలుగా 45 ఏళ్ల ఓ తండ్రి తన 14 ఏళ్ల కూతురుపై పలు మార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. దీంతో బాలిక పరిస్థితిని గమనించిన ఉపాధ్యాయురాలు రహస్యంగా ఆమెను ప్రశ్నించడంతో ఈ దారుణ ఘటణ వెలుగులోకి వచ్చింది.
బాలిక తల్లి 2013లో ఆరోగ్య సమస్యలతో మరణించిందని తెలిపింది. ఇదంతా విన్న తరువాత ఆ ఉపాధ్యాయురాలు పోలీసులకు సమాచారం అందించిగా పోలీసులు బాలిక కుటుంబ సభ్యుల ముందు చిన్నారి వాగ్మూలం తీసుకున్నారు. తన తండ్రి తనపై పలుమార్లు లైంగికదాడికి పాల్పాడ్డాడని, ఆవిషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించినట్లు పోలీసుకు తెలిపింది.
నాలుగు నెలల క్రితం ఆ బాలిక గర్భం కూడా దాల్చిందని తెలుస్తోంది. బాలిక వాంగ్మూలం ఆధారంగా నిందితుని పై పోక్సో కేసు పెట్టి గురువారం అదుపులోకి తీసుకొని విచారించగా మద్యం మత్తులో అలా చేశానని నిందితుడు తెలిపాడు. దీంతో అతనిపై సెక్షన్ 376,5,6 కింద కేసు నమోదు చేశారు. బాధితురాలిని అమ్మమ్మగారింటికి పంపి వారి సమ్మతితో వైద్యుల ఆమోదంతో గర్భం తొలగించడానికి ఏర్పాట్లు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com