Karnataka : అప్పుడు ప్రేమ పెళ్లి...ఇప్పుడు విషాదం...!

Karnataka :  అప్పుడు ప్రేమ పెళ్లి...ఇప్పుడు విషాదం...!
X
Karnataka : 25 ఏళ్ల యువతిని 45 ఏళ్ల ఓ వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్న వీడియో ఒకటి ఆ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

Karnataka : 25 ఏళ్ల యువతిని 45 ఏళ్ల ఓ వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్న వీడియో ఒకటి ఆ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా స్టోరీ విషాదంగా మారింది. కర్ణాటకకు చెందిన శంకరప్పకు 45 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాలేదు.. దీంతో అప్పటికే పెళ్లై భర్త నుంచి విడిపోయిన 25 ఏళ్ల మేఘన.. శంకరప్పను ప్రేమించి గతేడాది అక్టోబర్ లో ప్రేమించి పెళ్లి చేసుకుంది.

పెళ్లి అయ్యాక శంకరప్పను రూ. 2.5 కోట్ల భూమిని అమ్మాలని ఒత్తిడి తెచ్చింది. దీనికి శంకరప్ప అమ్మ ఒప్పుకోలేదు.. దీనితో ఇంట్లో తరుచు గొడవలు జరగడంతో శంకరప్ప తన పొలం వద్ద చెట్టుకి ఉరేసుకొని చనిపోయాడు. హులియూరు దుర్గ పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసుకొని స్వాధీనం చేసుకున్నారు. ఆస్తి అమ్మేసి బెంగుళూరు వెళ్లాలని శంకరప్పను భార్య బెదిరించేదని, కానీ ముసలి తల్లిని వదలలేక శంకరప్ప ఇక్కడే ఉండాలని అనుకున్నాడని స్థానికులు అంటున్నారు.

Tags

Next Story