SHANTHI: రాష్ట్రపతికి మదన్‌మెహన్‌ ఫిర్యాదు

SHANTHI: రాష్ట్రపతికి మదన్‌మెహన్‌ ఫిర్యాదు
X
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌లకు నాలుగు పేజీల లేఖ

గిరిజన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్‌రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి భర్త మణిపాటి మదన్‌మోహన్, సోషియల్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్‌ చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌లకు ఫిర్యాదు చేశారు. వారికి నాలుగు పేజీల లేఖ పంపారు. అగ్రకులానికి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది సుభాష్‌రెడ్డిలు తమ అధికార, ధన, కండ బలాన్ని ఉపయోగించి తన భార్యను లోబరుచుకొని ఆమెతో సంబంధం పెట్టుకొని చట్టవ్యతిరేకంగా బిడ్డను కన్నారని మదన్‌మోహన్‌ లేఖలో పేర్కొన్నారు.

ఎస్టీ వ్యక్తిగా తనకున్న హక్కులను హరించారని తెలిపారు. తన వైవాహిక జీవితాన్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా హక్కులను హరించినందున వారిపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. వారికి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి తన భార్యకు పుట్టిన మగబిడ్డకు తండ్రెవరో తేల్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ అక్రమ సంబంధం గురించి తాను మీడియాకు బహిర్గతం చేసిన తర్వాత కొందరు వ్యక్తులు నన్ను చంపుతామని బెదిరిస్తున్నారని తెలిపారు. తనకు సన్నిహితంగా ఉన్న పెద్దల పేర్లను బహిర్గతం చేశానన్న కోపంతో తన భార్య శాంతి కూడా నన్ను బెదిరిస్తూ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారని వెల్లడించారు. ఆమెకు ఒకవైపు అసాంఘిక శక్తులు, మరోవైపు బ్యూరోక్రాట్లతో సన్నిహిత సంబంధాలున్నాయని మదన్‌మెహన్ లేఖలో తెలిపారు. ప్రస్తుతం విజయసాయిరెడ్డి, పోతిరెడ్డి సుభాష్‌రెడ్డి, తన భార్య శాంతి ముగ్గురూ తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోనే నివాసం ఉంటున్నారని తెలిపారు. అందువల్ల వారిపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకొనే అధికారం తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓకి ఉన్నందున ఆ మేరకు ఆదేశాలు జారీచేయండి’’ అని మదన్‌మోహన్‌ ఈ లేఖలో పేర్కొన్నారు.


Tags

Next Story