Shilpa Chowdary: క్లోజ్‌ ఫ్రెండ్‌కే శిల్పా కుచ్చు టోపీ.. ఆమె ఫిర్యాదుతో..

Shilpa Chowdary (tv5news.in)
X

Shilpa Chowdary (tv5news.in)

Shilpa Chowdary: ప్రముఖ వ్యాపారవేత్త శిల్పను అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు.

Shilpa Chowdary: ప్రముఖ వ‌్యాపారవేత్త శిల్పను అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. శిల్పతో పాటు ఆమె భర్త తెల్ల శ్రీనివాస్ ప్రసాద్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. చాలామంది ప్రముఖుల్ని మోసం చేసిన శిల్ప.. దాదాపు 200 కోట్ల దాకా కుచ్చు టోపీ పెట్టినట్లు చెబుతున్నారు.

అధికవడ్డీ ఇస్తానని చెెప్పి.. ప్రముఖుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు చెబుతున్నారు పోలీసులు. పార్టీలిచ్చి సెలబ్రెటీలను ఆకర్షించినట్లు తెలుస్తోంది. ప్రముఖులంతా పోలీస్ స్టేషన్ కు క్యూ కడుతున్నారు. మోసపోయిన వాళ్లంతా మహిళా బాధితులే అంటున్నారు పోలీసులు.

దివ్యారెడ్డి అనే మహిళ ఫిర్యాదుతో శిల్పను అరెస్ట్ చేశామన్నారు పోలీసులు. దివ్యారెడ్డి, శిల్పా చౌదరి పదేళ్లుగా ఫ్రెండ్స్. దివ్య నుంచి కోటి రూపాయలు తీసుకున్న శిల్ప.. తిరిగివ్వమంటే బెదిరింపులకు పాల్పడింది. దివ్య పోలీసులను ఆశ్రయించడంతో శిల్పను అదుపులోకి తీసుకున్నారు నార్సింగి పోలీసులు.

Tags

Next Story