Shraddha Walkar Murder : ఛార్జ్షీట్ రెడీ

Shraddha Walkar Murder : ఛార్జ్షీట్ రెడీ



దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్దా వాకర్ హత్య కేసులో చార్జ్ షీట్ సిద్ధం చేశారు ఢిల్లీ పోలీసులు. 3000 పేజీల చార్జ్ షీట్ లో ఫోరెన్సిక్, ఎలక్ట్రానిక్ ఆధారాలతో పాటు, 100 సాక్ష్యాలు ఉన్నాయి. పోలీసులు సిద్ధం చేసిన చార్జ్ షీట్ ను న్యాయ నిపుణులు పరిశీలిస్తున్నారు. నిందితుడు అఫ్తాబ్ కు జరిపిన నార్కోటిక్ టెస్ట్ రిపోర్టులు కూడా ఇందులో ఉన్నాయి.



గత ఏడాది మేలో, అఫ్తాబ్ పూనావాలా తన ప్రియురాలు శ్రద్ధా వాకర్ ను అతి క్రూరంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఆమె మృత దేహాన్ని 35 ముక్కలుగా చేసి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పడవేశాడు. పోలీసులు సేకరించిన ఎముకలు, దవడ బాగాలు శ్రద్దా వాకర్ తండ్రి DNAతో సరిపోలాయి. గత ఏడాది నవంబర్ 12న ఢిల్లీ పోలీసులు అప్తాబ్ ను అరెస్ట్ చేసిన తర్వాత హత్యకు సంబంధించిన భయంకరమైన విషయాలు యావత్ దేశాన్ని కదిలించాయి. రంపంతో శ్రద్దా వాకర్ మృతదేహాన్ని అఫ్టాబ్ 35 భాగాలుగా చేసినట్లుగా తేలింది.



రెండు నెలలుగా శ్రద్దా వాకర్ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆమె స్నేహితుడు, శ్రద్దా తండ్రి వికాస్ మదన్ వాకర్ కు సమాచారం ఇచ్చారు. పోలీసులకు మదన్ వాకర్ ఫిర్యాదు చేయడంతో హత్య వెలుగులోకి వచ్చింది.

Tags

Next Story