Sachin Bishnoi : సచిన్ బిష్ణోయ్ అరెస్ట్..!

Sachin Bishnoi : సచిన్ బిష్ణోయ్ అరెస్ట్..!
సిద్దూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడు సచిన్ బిష్ణోయ్ ను అరెస్ట్ చేసేందుకు అజర్ బైజాన్ కు వెళ్లిన ప్రత్యేక బృందం


పంజాబీ గాయకుడు సిద్దూ మూస్ వాలా హంతకులలో ఒకడైన సచిన్ బిష్ణోయ్ ని ఢిల్లీకి రప్పించారు. ఇందుకుగాను ఢిల్లీ స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సీపీ) హరగోబిందర్ సింగ్ ధాలివాల్ ప్రకటించారు. సచిన్ ను అజర్ బైజాన్ లోని బాకునుంచి భారత్ కు రప్పించినట్లు తెలిపారు. సిద్దూ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సచిన్ బిష్ణోయ్ ను అరెస్ట్ చేయడానికి స్పెషల్ టీంను అజర్ బైజాన్ కు పంపారు.





ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సోమవారం రాత్రి అజర్ బైజాన్ కు చేరుకుంది. అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ACP) కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్ కు చెందిన ఇద్దరు ఇన్‌స్పెక్టర్లతో సహా నలుగురు అధికారులతో కూడిన జాయింట్ టీమ్ సచిన్ బిష్ణోయ్‌ను భారతదేశానికి రప్పించే బాధ్యతను అప్పగించింది.

కరుడుగట్టిన నేరస్థుడు లారెన్స్ బిష్ణోయ్ మేనల్లుడైన సచిన్ బిష్ణోయ్ గత ఏడాది మేలో జరిగిన హత్య తర్వాత పరారీలో ఉన్నాడు. నకిలీ పాస్‌పోర్ట్ ఉపయోగించి దేశం విడిచి పారిపోయాడు. సిద్ధూ మూస్ వాలా హత్య కేసులో సచిన్ బిష్ణోయ్ ప్రమేయం ఉన్నట్లు తెలువడంతో పోలీసులు అతన్ని పట్టుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. తాజాగా అతన్ని అరెస్ట్ చేసి అజర్ బైజాన్ నుంచి ఢిల్లీకి తరలించారు.

పంజాబీ గాయకుడు సిద్ధు మూస్ వాలా మే 29, 2022న మాన్సా జిల్లాలోని జవహర్కే గ్రామంలో కాల్చి చంపబడ్డాడు. ఒక రోజు తర్వాత, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో కీలక సభ్యుడు గోల్డీ బ్రార్, ప్రతీకారం తీర్చుకోవడానికి హత్యకు ప్లాన్ చేసినట్లు ఫేస్‌బుక్ పోస్ట్‌లో అంగీకరించాడు. మరొక గ్యాంగ్‌స్టర్‌ని చంపడం. ఆ తర్వాత హత్యకు ప్రధాన సూత్రధారి బ్రార్‌గా పోలీసులు పేర్కొన్నారు
.

Tags

Read MoreRead Less
Next Story