Asifabad : పెద్దల నిర్లక్ష్యం.. చిన్నారికి శాపం..

Asifabad : పెద్దల నిర్లక్ష్యం.. చిన్నారికి శాపం..
X
Asifabad : పెద్దల నిర్లక్ష్యమే పసిపిల్లలకు శాపంగా మారుతుంది. ఓ చిన్నారి కూల్ డ్రింక్‌లో ఉన్నది పురుగుల మందు అని తెలియక తాగింది

Asifabad : పెద్దల నిర్లక్ష్యమే పసిపిల్లలకు శాపంగా మారుతుంది. ఓ చిన్నారి కూల్ డ్రింక్‌లో ఉన్నది పురుగుల మందు అని తెలియక తాగింది. ఎన్ని ఆసుపత్రులు తిరగినా ప్రతిఫలం లేకుండా పోయింది. పసి వయసులోనే కన్నుమూసింది. కుమురంభీం జిల్లా ఆసిఫాబాద్‌లో ఈ హృదయవిదారక దుర్ఘటన చోటుచేసుకుంది. భీంపూర్ గ్రామానికి చెందిన రాజేశష్, లావణ్యలకు 5ఏళ్ల వయసున్న ముద్దుల కుమార్తె శాన్వి. ఎల్‌కేజీ చదువుతున్న ఆ చిన్నారి పెద్దనాన్న ఇంటి వద్ద ఆడుకుంటోంది. పంటలో వాడే పిచికారీ మిగిలిపోవడంతో ఆ ఇంటివారు దాన్ని కూల్ డ్రింక్ సీసాలో పోసి పెట్టారు.

అటుగా వచ్చిన చిన్నారి అది కూల్‌డ్రింక్ అనుకొని తాగింది. ఇంటికి వచ్చి వాంతులు చేసుకుంటున్న చిన్నారిని గమనించి కాగజ్‌నగర్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వైద్యులు మరో ఆసుపత్రికి పంపించారు. ఇలా పది ఆసుపత్రులు పట్టించుకోకుండా వరుసగా తిప్పారు. మార్గ మధ్యలోనే చిన్నారి మృతిచెందింది. అల్లారుముద్దుగా పెరిగిన చిన్నారి దూరమవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

Tags

Next Story