క్రైమ్

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో సగం కాలిన మృతదేహం.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా గుర్తింపు..

Sangareddy: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం లక్ష్మీపతి గూడెం శివారు బ్రిడ్జి వద్ద సగం కాలిన మృతదేహం కనిపించింది.

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో సగం కాలిన మృతదేహం.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా గుర్తింపు..
X

Sangareddy: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం లక్ష్మీపతి గూడెం శివారు బ్రిడ్జి వద్ద సగం కాలిన మృతదేహం కనిపించింది. కూకట్‌పల్లికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ నారాయణరెడ్డిదిగా పోలీసులు భావిస్తున్నారు. మూడు రోజుల క్రితం నారాయణరెడ్డిని హత్య చేసి.. శవానికి నిప్పు పెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. హంతకులు, హత్య వెనక కారణాలను అన్వేషిస్తున్నామని జిన్నారం పోలీసులు తెలిపారు.

KPHB పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తి అదృశ్యం అయ్యాడంటూ కేసు నమోదైంది. ఆ వ్యక్తి జిన్నారంలో హత్యకు గురైన నారాయణరెడ్డేనని అనుమానిస్తున్నారు. KPHB కాలనీ రోడ్‌ నెంబర్-1లో ఫ్రెండ్‌తో కలిసి ఉంటున్న నారాయణరెడ్డి.. గత నెల 30వ తేదీ నుంచి కనిపించడం లేదు. నారాయణరెడ్డి ఏడాది క్రితం తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

ఈ పెళ్లి ఇష్టం లేని యువతి తల్లిదండ్రులు, బంధువులు.. అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్లి హౌస్ అరెస్ట్ చేశారని నారాయణరెడ్డి సన్నిహితులు చెబుతున్నారు. ఈ విషయమై యువతి బంధువు శ్రీనివాస్‌రెడ్డి.. నారాయణరెడ్డిని బెదిరిస్తున్నాడనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నారాయణరెడ్డిని హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES