Hyderabad: ఆడపిల్లలు పుట్టారని భార్యను ఇంట్లో నుండి గెంటేసిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి..

Hyderabad: హైదరాబాద్ సైదాబాద్‌లోని ఇంద్రప్రస్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. ముగ్గురు ఆడపిల్లలు పుట్టారని శ్రీకాంత్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తన భార్యను ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు. దీంతో ముగ్గురు పిల్లలతో ఆ బాలింత భర్త ఇంటిముందు ధర్నా చేపట్టింది. బాధితురాలు స్వప్నకు మహిళా సంఘాలు అండగా నిలబడి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి. దీంతో స్థానిక పెద్దలు అత్తింటివారికి నచ్చజెప్పి బాధితురాలిని ఇంట్లోకి పంపించారు.
ఇంద్రప్రస్తాన్‌లో కాలనీకి చెందిన శ్రీకాంత్‌కు సైదాబాద్‌కు చెందిన స్వప్నకు పెద్దసమక్షంలో 2014లో పెళ్లి చేశారు. 12లక్షల కట్నం, 25 తులాల బంగారం ఇచ్చారు. వీరికి మొదటి, రెండో కాన్పులో ఆడపిల్లలు పుట్టారు. ఇక మూడో కాన్పులో ఒక బాబు, ఒక పాప పుట్టారు. ముగ్గురు ఆడపిల్లలు పుట్టారనే కోపంతో భార్యను బయటకు గెంటేశాడు ఆ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఎట్టకేలకు పెద్దమనుషులు నచ్చజెప్పి బాధితురాలిని ఇంట్లోకి పంపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com