Guntur: పెంచి పెద్దచేసి ఉన్నదంతా రాసిచ్చినా.. కన్నతండ్రిని..

Guntur: పెంచి పెద్దచేసి ఉన్నదంతా రాసిచ్చినా.. కన్నతండ్రిని..
Guntur: వాళ్లు లేకపోతే అతడికి జీవితమే లేదు.. కనిపెంచిన బిడ్డలు ప్రయోజకులు అవ్వాలని ప్రతి తల్లితండ్రీ కోరుకుంటారు..

Guntur: వాళ్లు లేకపోతే అతడికి జీవితమే లేదు.. కనిపెంచిన బిడ్డలు ప్రయోజకులు అవ్వాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు..ఎన్ని కష్టాలు పడి అయినా కొడుకులను పెంచి పెద్ద చేస్తారు.. ఎదిగిన కొడుకు తల్లిదండ్రులు ఆసరా కావాల్సింది పోయి తమ జీవితాలకు అడ్డుగా నిలుస్తున్నారని భావించే వారే చాలా మంది ఉంటున్నారు.




రోడ్డున పడ్డ తల్లిదండ్రులు పట్టెడన్నం కోసం పడరాని పాట్లు పడుతున్నారు. అయిన వాళ్లు ఉన్నా ఆదరించే వాళ్లు లేక బ్రతుకును దుర్భరంగా వెళ్లదీస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మహబూబ్ ఖాన్ కుమారులు తండ్రిని ఇంటి నుంచి గెంటివేశారు.



చేతిలో చిల్ల గవ్వ కూడా ఉంచుకోకుండా ఉన్నదంతా కొడుకులకు అప్పగించాడు.. ఈ రోజు అతడిని వీధిలోకి నెట్టారు. కన్న కొడుకులు తన పట్ల చూపిస్తున్న అన్యాయానికి కలత చెందాడు.. మరో దారిలేక పోలీసులను ఆశ్రయించాడు..



కొడుకుల మీద ఫిర్యాదు చేయడానికి మనసొప్పలేదు.. కానీ మరో దారిలేదు.. ప్రాణం ఉన్నంతవరకైనా పట్టెడన్నం పెట్టమని, నిలువ నీడ కల్పించమని పోలీసులను వేడుకుంటున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story