తల్లిదండ్రులు మందలిస్తున్నారని గొడ్డలితో దాడి చేసిన కొడుకు

మహబూబ్ నగర్ జిల్లా ముక్తల్‌లో దారుణం చోటు చేసుకుంది. కన్న తల్లిదండ్రులపైనే గొడ్డలితో దాడి చేశాడు కసాయి కొడుకు. జులాయిగా తిరుగుతున్నాడంటూ తల్లిదండ్రులు మందలించిన నేరానికి కొడుకు కిరాతకానికి పాల్పడ్డాడు. వారు నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో నరికేశాడు.
నారాయణపేట జిల్లా ముక్తల్ మండలంలోని మాధ్వర్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల వెంకటేష్ పని పాట లేకుండా జులాయిగా తిరుగుతున్నాడు. దీంతో గత నాలుగైదు రోజులుగా తల్లిదండ్రులు మందలిస్తుండడంతో.. ప్రతి రోజు వారితో గొడవపడుతున్నాడు. రోజూ తల్లిదండ్రులు మందలిస్తున్నారని మనసులో కోపం పెంచుకున్న వెంకటేష్.. రాత్రి విచక్షణా రహితంగా గొడ్డలితో తల్లిదండ్రులపై దాడి చేశాడు.. తీవ్ర గయాలతో రక్తం మడుగులో ఉన్న తల్లిదండ్రులను గుర్తించి చిన్న కొడుకు హుటాహుటిని ఆస్పత్రికి తరలించాడు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగానే ఉంది. అయితే వెంకటేషన్‌కు మతిస్థిమితం సరిగ్గా లేదని కుటుంబ సభ్యులు అంటున్నారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com