క్రైమ్

Nizamabad Crime : తండ్రి, బాబాయిని ఘోరంగా హత్య చేసిన కొడుకు..

Nizamabad Crime : నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. కన్న కొడుకు తండ్రిని, బాబాయిని అతి దారుణంగా చంపాడు.

Nizamabad Crime : తండ్రి, బాబాయిని ఘోరంగా హత్య చేసిన కొడుకు..
X

Nizamabad Crime : నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. కన్న కొడుకు తండ్రిని, బాబాయిని అతి దారుణంగా చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన మోపాల్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. కర్రొళ్ల అబ్బయ్య, కర్రొళ్ల సాయిలు మధ్య గత కొంతకాలంగా భూ వివాదం కొనసాగుతోంది. దీంతో ఇరువురి మధ్య తరుచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో కర్లోళ్ల అబ్బయ్య కొడుకు సతీష్ .. రెచ్చిపోయి తన తండ్రి అబ్బయ్యతోపాటు చిన్నానను పారతోకొట్టి చంపేశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. రాఖీ పండుగ సందర్భంగా ఇద్దరు హత్యకు గురికావడంతో తీవ్రకలకలం రేపింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.

Next Story

RELATED STORIES