మద్యానికి బానిసైన కొడుకు.. మట్టుబెట్టిన తల్లిదండ్రులు

మద్యానికి బానిసైన కొడుకు.. మట్టుబెట్టిన తల్లిదండ్రులు
చిన్నప్పుడు చెప్పిన మాట వినకపోతే నాలుగు తగిలించి దారిలో పెడతారు.. మరి పెద్దయ్యాక కూడా బుద్దిలేని పనులు చేస్తే తాగి తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటే, ఉన్న ఇంటిని కూడా అమ్మేయాలంటూ గొడవ చేస్తుంటే, తల్లి తన పేగు బంధాన్ని మరిచిపోయింది.

చిన్నప్పుడు చెప్పిన మాట వినకపోతే నాలుగు తగిలించి దారిలో పెడతారు.. మరి పెద్దయ్యాక కూడా బుద్దిలేని పనులు చేస్తే తాగి తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటే, ఉన్న ఇంటిని కూడా అమ్మేయాలంటూ గొడవ చేస్తుంటే, తల్లి తన పేగు బంధాన్ని మరిచిపోయింది.. ఇలాంటి కొడుకు ఉన్నా లేకున్నా ఒకటే అనుకున్నారు.. సుపారీ ఇచ్చి మరీ చంపించేశారు. ఈ విషాద సంఘటన ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న అల్లూరి సీతారామ రాజు జిల్లా ఎటపాకలో చోటు చేసుకుంది.

తెలంగాణలోని భద్రాచలం మెడికల్ కాలనీకి చెందిన పగిల్ల రాము, సావిత్రిల కుమారుడు దార్గాప్రసాద్. రోజూ మద్యం తాగి ఇంటికొట్టి కుటుంబసభ్యులతో గొడవపడేవాడు. అతడి ప్రవర్తనతో విసిగిపోయిన భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అయినా దుర్గాప్రసాద్ లో మార్పు రాలేదు. ఇంటిని అమ్మేయాలంటూ తల్లిదండ్రులతో రోజూ గొడవపడేవాడు. కొడుకు పెడుతున్న బాధలకు తల్లిదండ్రుల్లో కూడా సహనం నశించి పోయింది. అతడి దుర్మార్గాలకు విసిగి వేసారి పోయారు. కొడుకును అంతమొందించేందుకు భద్రాచలానికి చెందిన గుమ్మడి రాజు, షేక్ ఆలీపాషా లకు రూ.3 లక్షల సుపారీ ఇచ్చి ఒప్పందం కుదుర్చుకున్నారు.

పథకం ప్రకారం ఈ నెల 9న అర్థరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న దుర్గాప్రసాద్ ను సుపారీ తీసుకున్న వ్యక్తులు, తల్లిదండ్రులు కలిసి కత్తితో మెడ కోసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని తుమ్మలనగర్ అటవీ ప్రాంతానికి ఆటోలో తీసుకొచ్చి గానుగచెట్ల తోటలో పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ తరువాత నలుగురూ ఊరు విడిచి వెళ్లిపోయారు. 10 వ తేదీ మద్యాహ్నం కట్టెల కోసం అడవికి వెళ్లిన వ్యక్తికి కాలిపోయిన శవం కనిపించింది. విషయం పోలీసుల దృష్టికి తీసుకువెళ్లడంతో ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృత దేహం ఫోటోతో కరపత్రాలు వేశారు. మృతుని భార్య ఆ ఫోటోలో ఉన్న తన భర్తే అని గుర్తు పట్టి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు ఎంక్వైరీ ప్రారంభించగా తల్లిదండ్రులే దోషులని తేలి వారిని వెతికి పట్టుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు.

Tags

Read MoreRead Less
Next Story