Sonali Phogat : సోనాలీ ఫోగట్ పోస్ట్‌మార్టం రిపోర్ట్.. గుండెపోటు కాదు హత్య..

Sonali Phogat : సోనాలీ ఫోగట్ పోస్ట్‌మార్టం రిపోర్ట్.. గుండెపోటు కాదు హత్య..
X
Sonali Phogat : ప్రముఖ టిక్‌టాక్‌ స్టార్‌, బీజేపీ నేత సోనాలీ ఫోగాట్‌ మృతి రోజుకో మలుపు తిరుగుతోంది.

Sonali Phogat : ప్రముఖ టిక్‌టాక్‌ స్టార్‌, బీజేపీ నేత సోనాలీ ఫోగాట్‌ మృతి రోజుకో మలుపు తిరుగుతోంది. తన సహచరులు, మిత్రులతో కలిసి గోవా పర్యటనకు వెళ్ళిన సోనాలీ ఫోగాట్‌ హఠాత్తుగా చనిపోవడంతో కలకలం చెలరేగింది. తాజాగా సోనాలి ఫోగట్‌ది హత్యేనని పోస్టుమార్టం రిపోర్టు తేల్చింది. ఆమె మృతదేహంపై 'చాలా చోట్లు గాయాలు' ఉన్నట్లు పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది.

హర్యానాలోని హిసార్‌కు చెందిన బీజేపీ నాయకురాలు ఫోగట్ మంగళవారం ఉదయం చనిపోయింది. అంజునా ప్రాంతంలోని సెయింట్ ఆంథోనీ ఆస్పపత్రిలో మరణించినట్లు పోలీసు అధికారి తెలిపారు. ముందుగా ఆమె మరణానికి గుండెపోటు కారణమని అంతా భావించారు. మొదట సోనాలీ ఫోగాట్‌ గుండెపోటుతో చనిపోయినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కానీ పక్కా ప్లాన్‌తోనే ఆమెను మర్డర్‌ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇటు సోనాలీ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో సోనాలి మృతి కేసు అనుకోని మలుపు తిరిగింది. సోనాలీ మృతిపై కేసు నమోదయ్యే వరకు పోస్ట్‌మార్టమ్‌కి అంగీకరించలేదు కుటుంబ సభ్యలు. మరోవైపు గోవాకు వెళ్లిన ఇద్దరు సహచరులు ఆమెను హత్య చేశారని ఆమె సోదరుడు రింకూ ధాకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోనాలి చనిపోయిన తర్వాత హర్యానాలోని ఆమె ఫామ్‌హౌస్‌లోని సీసీటీవీ కెమెరాలు, ల్యాప్‌టాప్, ఇతర కీలకమైన వస్తువులు కనిపించకుండా పోయాయని ఆమె సోదరుడు ఆరోపించారు. దీంతో గోవా పర్యటనలో సోనాలీతో పాటు ఉన్న సుధీర్ సగ్వాన్‌, సుఖ్విందర్ వాసీలపై హత్యానేరం కింద కేసులు నమోదు చేశారు.

సోనాలీ ఫోగాట్ ఈనెల 22న గోవా వెళ్ళారు. అయితే ఏదైనా షూట్‌ కోసం వెళ్ళారా అన్న అనుమానానికి కుటుంబం నుంచి లేదనే సమాధానం వస్తోంది. మరి సోనాలీ హఠాత్తుగా గోవా ట్రిప్‌ ఎందుకు వెళ్ళినట్లు? అరేంజ్ చేసింది ఎవరు? రెండు రూములు బుక్‌ చేసుకుంటే ఏయే గదుల్లో ఎవరున్నారు? ఇలా సోనాలీ ఫోగాట్‌ మృతిపై పలు అనుమానాలు కలకలంరేపుతున్నాయి.

సోనాలీకి సోషల్‌ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. ఈమె 2020లో రియాలిటీ షో బిగ్‌బాస్‌-14లో కంటెస్టెంట్‌గా ఉన్నారు. ఆ తరువాత సోనాలీ పొలిటీషియన్‌గా అవతారమెత్తారు. సోనాలీ చేసిన టిక్‌ టాక్‌ వీడియోలకు విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. అయితే సోనాలీ హఠాత్తుగా గోవాలో మృతిచెందడంతో ఆమె అభిమానులు జీర్ణీంచుకోలేకపోతున్నారు.

Tags

Next Story