crime news: యువనటి ఆత్మహత్య.. ఇండస్ట్రీలో బతకడం అంత సులభం కాదంటూ సూసైడ్ నోట్..

Crime News: ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదని తెలిసినా బ్రతికి పోరాటం చేయలేక చావేనయమని బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. నిండు నూరేళ్ల జీవితాలకు ముగింపు పలుకుతున్నారు. ఈ జాబితాలోకి ఈ మధ్య యువ నటీనటులు ఎక్కువగా వచ్చి చేరుతున్నారు. సౌత్ కొరియాకు చెందిన నటి యో జూ యూన్ ఆగస్ట్ 29న డిప్రెషన్‌తో బాధపడుతూ ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆమె రాసిన ఎమోషనల్ సూసైడ్ నోట్ అందరి చేత కంటతడి పెట్టిస్తోంది. ఇండస్ట్రీలో బతకడం అంత సులభం కాదంటూ ఆమె రాసిన నోట్ సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.
యూన్ రాసిన సూసైడ్ నోట్.. అమ్మా, నాన్న, అన్యయ్య, నానమ్మ అందరూ నన్ను క్షమించండి. బతకాలని లేదని నా హృదయం తరచుగా ఆవేదన చెందింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. ఇప్పుడు నేను చాలా ప్రశాంతంగా ఉన్నా. ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ ఆలోచన చేస్తున్నా. ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నా. నేను లేని మీ జీవితాలు ఎంత వెలితిగా ఉంటాయో నాకు తెలుసు. అయినా ధైర్యంగా జీవించండి.. నేను మిమ్మల్ని పై నుంచి చూస్తూనే ఉంటా.
ఇప్పటి వరకు ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడిపాను. అందుకే నాకు ఈ జీవితం ఇక చాలు అనిపించింది. కాబట్టి నా విషయంలో ఎవరినీ నిందించకండి. మీరు సంతోషంగా ఉండండి. నేను చనిపోలేదు. మీతోనే ఉన్నాను. మీ జ్ఞాపకాల్లో ఉన్నాను. నేను చివరి వరకు ఎన్నో మర్చిపోలేని జ్ఞాపకాలతో జీవించాను. మీ అందరికీ నేను ఎంతో రుణపడి ఉంటాను. ఇక సెలవు అంటూ యూన్ తన సూసైడ్ నోట్‌లో రాసుకొచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com