Karnataka : లైంగిక వేధింపుల కేసులో శ్రీ మురుగ పీఠాధిపతి శివమూర్తి అరెస్ట్..

Karnataka : లైంగిక వేధింపుల కేసులో శ్రీ మురుగ పీఠాధిపతి శివమూర్తి అరెస్ట్..
Karnataka : కర్ణాటకలోని శ్రీ మురుగ పీఠాధిపతి శివమూర్తి మురుగ శరనరును పోలీసులు అరెస్టు చేశారు.

Karnataka : కర్ణాటకలోని శ్రీ మురుగ పీఠాధిపతి శివమూర్తి మురుగ శరనరును పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు మైనర్‌ బాలికలను లైంగికంగా వేధించారని ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనపై పోక్సో కింద కేసు నమోదు చేశారు పోలీసులు. శివమూర్తి తాను నిర్దోషినని..తనను కుట్ర ప్రకారం కేసులో ఇరికించారని చెప్తున్నారు. త్వరలోనే నిర్దోషిగా బయటకు వస్తానన్నారు. అటు శివమూర్తిని 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి మేజిస్ట్రేట్‌ పంపించారు. పోక్సో కేసు కింద మురుగ పీఠాధిపతిని అరెస్టు చేశామన్నారు పోలీసులు. తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని చెప్పారు.

మురుగ మఠంలోని ఓ వర్గం ఉద్యోగులతో పాటు మూడు రోజుల నుంచి దళితులు చేస్తున్న ఆందోళనలతో శివమూర్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఐతే శివమూర్తి కర్ణాటకలో రాజకీయాలను శాసించే లింగాయత్‌ కమ్యూనిటీకి చెందిన వాడు కావడంతో అటు కాంగ్రెస్‌ కానీ..ఇటు అధికార బీజేపీ కానీ ఈ ఇష్యూపై నోరు మెదపడం లేదు.

మాజీ ముఖ్యమంత్రి B.S. యడ్యూరప్ప బహిరంగంగానే శివమూర్తికి మద్దతుగా నిలిచారు. శివమూర్తిని కుట్రలో ఇరికించారని ఆరోపించారు. మరోవైపు ఈ నెల ప్రారంభంలో కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ మురుగ మఠాన్ని సందర్శించారు.

శివమూర్తి అరెస్టుకు ముందు పోలీసులు శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. చిత్రదుర్గ, మైసూరు జిల్లాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక మురుగ మఠానికి చెందిన ఇద్దరు బాలికలు మైసూరులోని ఓ ప్రభుత్వేతర సంస్థను సంప్రదించి తమను వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో కలగజేసుకున్న NGO పోలీసులకు సమాచారం అందించింది. ఆగష్టు 26న కేసు నమోదైంది.

Tags

Read MoreRead Less
Next Story