Kadapa crime : ఐదేళ్ల కూతురిని కొండపైకి తీసుకుని వెళ్లి...

X
Kadapa: ఐదేళ్ల కూతురిని మారు తండ్రి బైక్ పై తీసుకెళ్తానని మాయ మాటలు చెప్పి కొండపై నుంచి తోసేసి చంపే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన కడప జిల్లా మైదుకూరు మండలంలో జరిగింది. ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న శంకర్ మొదటి భార్య చనిపోవడంతో.. 8 నెలల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు.
రెండవ భార్య కుమార్తె అయిన దస్తగిరమ్మ పేరున 80 వేల విలువ చేసే ఇళ్లు ఉంది. దీంతో ఇళ్లు కాజేయాలన్న దురుద్దేశ్యంతో శంకర్.. బాలికను బైక్‌పై తీసుకెళ్తానని మాయ మాటలు చెప్పి మారు మిట్టమాను పల్లె సమీపంలోని కొండపై నుంచి తోసేసాడు. తీవ్ర గాయాలతో ఉన్న బాలికను చూసిన స్థానిక గొర్రెల కాపరి ఆసుపత్రికి తరలించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందుతుడిని అదుపులోకి తీసుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
