వీడు మనిషేనా ? 65 ఏళ్ల తండ్రి పెదాలను తాడుతో కుట్టి, చేతులు, కాళ్లను రైల్వే ట్రాక్‌కు కట్టి..!

వీడు మనిషేనా ? 65 ఏళ్ల తండ్రి పెదాలను తాడుతో కుట్టి, చేతులు, కాళ్లను రైల్వే ట్రాక్‌కు కట్టి..!
తండ్రి, పైగా 65ఏళ్ల వృద్దుడని కూడా చూడకుండా అతని పెదాలను తాడుతో కుట్టి, చేతులు, కాళ్లను రైల్వే ట్రాక్‌కు కట్టి దాష్టీకానికి పాల్పడ్డాడు సవతి కొడుకు.

జార్ఖండ్ రాష్ట్రంలో ఓ అమానుషమైన ఘటన చోటుచేసుకుంది. తండ్రి, పైగా 65ఏళ్ల వృద్దుడని కూడా చూడకుండా అతని పెదాలను తాడుతో కుట్టి, చేతులు, కాళ్లను రైల్వే ట్రాక్‌కు కట్టి దాష్టీకానికి పాల్పడ్డాడు సవతి కొడుకు. గ్రామస్తులు ఈ విషయాన్నీ తెలుసుకొని పోలీసులకి సమాచారం ఇవ్వడంతో పోలీసులు రైల్వే ట్రాక్‌ నుంచి ఆ వృద్ధుడిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పాలము జిల్లాలోని అంటారి రోడ్ బ్లాక్‌లోని భీతిహర గ్రామంలో చోటు చేసుకుంది.

స్థానికంగా నివసించే భోలా రామ్ అనే వృద్ధుడి మొదటి భార్య చనిపోవడంతో 2010లో రెండో వివాహం చేసుకున్నాడు. అయితే సవతి తండ్రి పై కోపాన్ని పెంచుకున్నాడు రెండో భార్య కొడుకు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి సమయంలో మూత్రవిసర్జన కోసం వచ్చిన తండ్రి పై విచక్షణారహితంగా దాడీ చేశాడు. అనంతరం ముగ్గురు వ్యక్తులతో కలిసి తండ్రి పెదాలను తాడుతో కుట్టి, చేతులు, కాళ్ళను కట్టి, సమీపంలోని రైల్వే ట్రాక్‌కు తీసుకొని వెళ్లాడు. రాత్రి 11 గంటల సమయంలో రైల్వే ట్రాక్‌కు అతన్ని కట్టేసి అక్కడినుంచి వారు వెళ్ళిపోయారు. ఉదయాన్నే రైల్వే ట్రాక్‌ పై పడి ఉన్న వ్యక్తిని గ్రామస్తులు గుర్తించి పోలీసులకి సమాచారం అందించారు.


అనంతరం పోలీసులు వృద్ధుడిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వృద్దుడు క్షేమంగానే ఉన్నట్టుగా వైద్యులు వెల్లడించారు. అయితే ఇందులో వృద్దుడి రెండో భార్య హస్తం కూడా ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామని, నిందితులను అరెస్టు చేస్తామని వెల్లడించారు. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Tags

Read MoreRead Less
Next Story