వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి

వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి
తెలంగాణ రాష్ట్రంలో వీధికుక్కల దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్‌లో జరిగిన సంఘటన మరవక ముందే హనుమకొండ జిల్లా, కాజీపేటలో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది

తెలంగాణ రాష్ట్రంలో వీధికుక్కల దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్‌లో జరిగిన సంఘటన మరవక ముందే హనుమకొండ జిల్లా, కాజీపేటలో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. వీధి కుక్కల దాడిలో అభంశుభం తెలియని బాలుడు మృత్యువాతపడ్డాడు. కాజీపేట రైల్వే క్వార్టర్స్ లోని చిల్డ్రన్ పార్క్ వద్ద ఎనిమిదేళ్ల బాలుడు ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుక్కులు దాడి చేశాయి. ఈ ఘటణలో తీవ్రంగా గాయపడిన బాలుడు మృతి చెందాడు.

పోస్టుమార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. దీంతో స్థానికులు ప్రజాప్రతినిధులపై, సంబంధిత అధికారులపై మండిపడుతున్నారు. గత కొద్ది కాలంగా కుక్కలు వీధుల్లో స్వైర విహారం చేస్తున్నాయని అయినా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధుల్లో తిరాగాలంటేనే భయమేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story