తల్లిదండ్రుల్ని పోషించడంలో కుమారుల నిర్లక్ష్యం.. వృద్ధ దంపతుల ఆత్మహత్య..!

తల్లిదండ్రుల్ని పోషించడంలో కుమారుల నిర్లక్ష్యం.. వృద్ధ దంపతుల ఆత్మహత్య..!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పట్వారీ గూడెంలో వృద్ధ దంపతులు దూపకుంట్ల భూషణం(75), ఆదిలక్ష్మీ(70) ఆత్మహత్యకు పాల్పడ్డారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పట్వారీ గూడెంలో వృద్ధ దంపతులు దూపకుంట్ల భూషణం(75), ఆదిలక్ష్మీ(70) ఆత్మహత్యకు పాల్పడ్డారు. వృద్ధ దంపతులకు నలుగురు కుమారులు ఉండగా... తల్లిదండ్రుల్ని పోషించడంలో వంతులు పెట్టుకుంటూ భారంగా భావించారని తెలుస్తోంది. నగుగురు కుమారుల్లో ఇద్దరు సత్తుపల్లిలో, ఇద్దరు పట్వారీగూడెంలో స్థిరపడ్డారు. కానీ తల్లిదండ్రుల్ని చూసుకునే విషయంలో తరచుగా కుమారుల మధ్య గొడవలు పెట్టుకునేవారని స్థానికులు చెబుతున్నారు. తమను పోషించే విషయంలో కుమారులు గొడవ పెట్టుకోవడాన్ని భరించలేక వృద్ధ దంపతులు ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story