Sushant Singh Rajput: అతడిది హత్యే! పోస్ట్ మార్టమ్ చేసిన డాక్టర్ సంచలన ప్రకటన

Sushant Singh Rajput: అతడిది హత్యే! పోస్ట్ మార్టమ్ చేసిన డాక్టర్ సంచలన ప్రకటన
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించి రెండేళ్లు గడుస్తున్నా దాని వెనకున్న మిస్టరీ మాత్రం నేటికీ వీడలేదు. సీబీఐ విచారణ పూర్తి చేసినప్పటికీ తేలాల్సిన నిజనిజాలు చాలానే ఉన్నాయి. ఈ తరుణంలో కేసులో కీలక మలుపు ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోలేదని, అతడు హత్య చేయబడ్డాడని కూపర్ హాస్పిటల్ మార్చురీలో పనిచేసిన డా. రూప్ కుమార్ షా చేసిన వ్యాఖ్యలుఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. సుశాంత్ మృతదేహానికి పోస్టుమార్టం జరిగినప్పుడు తాను అక్కడే ఉన్నానని కుమార్ చెప్పారు. సుశాంత్ శరీరంపై గాయాలు ఉన్నాయని, అతడిని ఎవరో కొట్టారని తెలిపారు.
ఖచ్చితంగా సుశాంత్ ది ఆత్మహత్య కాదని, హత్య అని డాక్టర్‌కి ఎంత చెప్పినా ఎవరూ తనను పట్టించుకోలేదని కుమార్ అన్నారు. మరోవైపు ఈ విషయాన్ని ఇంతకాలం ఎందుకు దాచిపెట్టాడో కూడా కారణం వెల్లడించాడు. తాను అప్పుడు ఉద్యోగంలో ఉన్నానని, పనిలో ఎవరికీ ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే ఇంత కాలం ఈ విషయం ప్రస్తావించలేదని అన్నారు.
కూపర్ హాస్పిటల్ లో నెలన్నర క్రితం రిజైన్ చేసిన రూప్ కుమర్ ఇప్పుడు నిజానిజాలు నిర్భయంగా చెబుతానంటున్నారు. మరి అతడి వ్యాఖ్యలు బీ-టౌన్ లో ఎలాంటి దుమారం లేపుతాయో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com