Tamil Nadu : రసం పాత్రలో పడి యువకుడు మృతి

Tamil Nadu : రసం పాత్రలో పడి యువకుడు మృతి
X

రసం పాత్రలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరువళ్లూర్ లో జరిగింది. 21 ఏళ్ల యువకుడు పార్ట్ టైం జాబ్ గా ఓ క్యాటరింగ్ సంస్థలో పనిచేస్తున్నాడు. అథితులకు భోజనం వడ్డించడంలో భాగంగా రసం తీసుకురావడానికి వెళ్ళాడు. ప్రమాదవశాత్తు మరుగుతోన్న రసం పాత్రలో పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన యువకున్ని ప్రభుత్వ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. చికిత్స పొందుతూ యువకుడు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరుగగా ఈ రోజు యువకుడు కన్నుమూశాడు.

Tags

Next Story